అంతర్జాలంలో జరిగిన కాప్రా మల్కాజగిరి అంతర్జాల కవిసమ్మేళనం శనివారం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మొదట సమావేశం అధ్యక్షులు మరియు సహస్ర సినీటీవీ పాటల రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు కవులకు స్వాగతం పలికారు.సమూహ ఉద్దేశ్యాలను, చేసిన మరియు చేయబోయే కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని జంట కవులు తిరుపతి వెంకట కవులలో ఒకరైన తిరుపతి శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. వారి పాండవోద్యోగ విజయం నాటకం మరియు పద్యాలు తెలుగు దేశాన బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు.
పిమ్మట కవి సమ్మేళనాన్ని నిర్వాహక బృందం శ్రీ మౌనశ్రీ మల్లిక్, డాక్టర్ రాధా కుసుమ, డాక్టర్ దీపక్ న్యాతి మరియు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ నిర్వహించారు. పద్యకవి రాధశ్రీ, అంబటి లింగ క్రిష్ణారెడ్డి, మునిమడుగు నాగరాజ శాస్త్రి మరియు నామాల రవీంద్ర సూరి చక్కగా పద్యాలను ఆలపించి అందరినీ అలరించారు. మౌనశ్రీ మల్లిక్ చలికాలంలో శ్రీమతితో పెట్టుకోవద్దని హాస్యోక్తంగా కవిత వినిపించారు. డాక్టర్ రాధాకుసుమ సముద్రంపై అద్భుత కవితను వినిపించారు. డాక్టర్ దీపక్ న్యాతి వారు సృష్టించిన దివిటీలు లఘుకవితలను చక్కగా వినిపించారు.గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ "ఎంత బాగుండు" అంటూ ఆవేశంగా తన కవితను ఆలపించి వీక్షకులను కవిత బాగు బాగు అనిపించారు. కవులు డాక్టర్ రాయరావు సూర్యప్రకాశరావు, కోదాటి అరుణ, దేవి గాయత్రి,బుక్కపట్నం రమాదేవి, డాక్టర్ మోటూరి నారాయణరావు, అయ్యల సోమయాజుల ప్రసాద్, చేపూరి జె వి కుమార్ , డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి, పి పద్మావతి, దీకొండ చంద్రకళ, అర్వ రవీంద్రబాబు, శోభా దేశ్ పాండె మరియు పొన్నాల ధనమ్మరెడ్డి వారి కవితలను చదివి అందరి మనసులను దోచుకున్నారు. చివరిగా దీపక్ న్యాతి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి