డిసెంబర్ నెలలో జన్మించినమహాపురుషులు..సేకరణ....అచ్యుతుని రాజ్యశ్రీ

 డిసెంబర్ 3 న జన్మించిన భారత రత్న  రాజర్షి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మన తొలి రాష్ట్రపతి నిగర్వి నిరాడంబర జీవి.మహామేధావి కానీ నిండుకుండ .బీహార్ రాష్ట్రంకి చెందిన ఆయన చదువులో ఫస్ట్.పాట్నా లో న్యాయవాదిగా పురపాలక సంఘ అధ్యక్షునిగా పనిచేస్తున్న ఆయన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.ఆస్తమా వ్యాధితో బాధపడుతూగూడా జైల్లో యమయాతనలు అనుభవించారు. సరోజినీనాయుడు ఆయనను" పంచదారపు ముద్ద లంప్ ఆఫ్ షుగర్" అని  సర్దార్ పటేల్" ఎక్స్ రే ప్లాంట్" అని కొనియాడారు.కాంగ్రెస్ అధ్యక్షునిగా రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షునిగా పనిచేసిన అజాతశత్రువు. ఆయన బాల్యంలో పవహర్ బాబా అనే మహాత్ముని తండ్రితో కలిసి దర్శించాడు. "నీ కొడుకు చక్రవర్తి అవుతాడు" అన్న ఆయనవాక్కు నిజమై రాజన్ బాబు రాష్ట్రపతిగా పదవికి వన్నె తెచ్చారు.ఇంకో భారత జాతిరత్నం కె.ఎం.మున్షీ రచయిత న్యాయవాది రాజకీయ వేత్త 30డిసెంబర్ లో జన్మించారు.లాయర్ గా ఉంటూ గుజరాతీభాషలో తొలినవల రాశారు. భారతీయ విద్యాభవన్ ని స్థాపించి భవన్స్ జర్నల్ పత్రికను నడిపారు.హైదరాబాద్ విలీనంలో ఆయన పటేల్ తో సమంగా కృషిచేశారు. స్వాతంత్య్రం వచ్చాక కేంద్ర ఆహార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వనమహోత్సవం జరపాలని పిలుపునిచ్చారు.సోమనాథ ఆలయం పునరుద్ధరణ లో ప్రముఖ పాత్ర వహించిన ఆయన 1937 లో "జయసోమనాథ" అనే నవలను రాశారు. విశ్వసంస్కృత పరిషత్తుని స్థాపించిన ఆయన సంస్కృతములో ప్రసంగించేవారు. యు.పి.గవర్నర్ గా1952 లో పనిచేశారు.వితంతువైనలీలావతిని పెళ్లాడాడు.నిజంగా మహోన్నత మైన వీరి జీవిత చరిత్రలు మనం చదవాలి🌹
కామెంట్‌లు