కమ్మని కలలా నాలో అలల నది
రమ్మని పిలిచే నిన్నటి బతుకు కళ
పోలేక రాలేక మనసు రణగొణ వీణ
బొడ్డుమల్లె చెట్టు నీడ మామిడితోట
లచ్చకుంట వాగు దాట శీత్యా తండా
తోకబాయి అమ్మమ్మ బాయి పారే పొలాలు
చెరువుకట్ట మీద నడక మత్తడి చేర్చు
దీకొండ ఎల్లయ్య మైత్రి పల్లీ మక్కకంకి తీపి
చెరువు దాటిన నడక సాగే మంగ్యా తండా
తొర్రూరు తోవల దళిత జీవుల ఆవాసం
మడూరు బాటల బడి గొంతు పాఠం
సడుగు కోసి మండువా దాట సన్నూరు గుడి
కుల కుంపట్లు లేని కులవృత్తుల జీవి
మత ముచ్చటల్లేని కలిమి చెట్టు ఊరు
కడుపున బువ్వు కనుల కునుకు తృప్తి
తంగేడు తనువున బీర కట్ల గునుగు పూల ముత్తైదు
ఊరు ఊరంత సింగిడి సింగారు భామల సందడి
ఆటపాటల దీవెన బంగారు బతుకమ్మ
పుటాసు పిస్తోలు బిళ్ళల ఢాంఢాం పేలే లక్ష్మీబాంబు
చిచ్చుబుడ్లు మతాబులు గోలల దసరా పండుగ
జమ్మి ఆలింగనాల పసిడిహేల ఇంటింట
================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి