అసలేముందో తెలియని
మరో పుట తెరిస్తే
అర్థం అయేలోపు కరిగి
ఆవిరయేది కాలం.
రోజూ వచ్చే సూరీడు
ఏం తెస్తాడో ముందే చెప్పడు
తెలుసుకునేలోగా పడమట
మాయమవుతాడు
ప్రశ్నలే సమాధానాలైన
పరీక్షలు పెట్టి చోద్యం చూసి
పరుగులు పెట్టించి తానేమో
పరుగున సాగిపోతాడు
రేపటి కోసం ఆశలు నింపి
ఓర్పుగా వేచి చూడమని
ఊహల పల్లకి ఎక్కిస్తాడు
ఆఖరి తీర్పు నాదేనంటాడు.
అసలు చదవని పుస్తకంలో
జవాబు తెలియని ప్రశ్నలిచ్చి
ఫలితం తెలియనివ్వక
పరీక్షలు పెట్టేదే జీవితం..
మాయలాంటి మంచు కరిగించే
ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి