సమాజ భాగస్వామ్యంతోనే పాఠశాల అభివృద్ధి సాధ్యమని, తల్లిదండ్రులే ఆ పురోగతికి పునాదులని పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు అన్నారు. పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు హాజరైన తల్లిదండ్రులతో ముఖాముఖి చర్చలు జరిపి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వ్యూహరచన గావించడమైనది. నేటి సమావేశం పండగ వాతావరణాన్ని కల్పించడంలో భాగంగా తల్లులకు రంగోలి పోటీలు, తండ్రులకు టగాఫ్ వార్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. రంగోలి పోటీల్లో పాత్రో పావని, సురవరపు అశ్విని, అధికారి లలిత, పతివాడ కాంచనమాల విజేతలుగా నిలిచి బహుమతులు పొందారు. మూడు విభాగాలుగా జరిగిన మ్యూజికల్ చైర్ పోటీల్లో ఒకటో బ్యాచ్ నుంచి పతివాడ నిర్మల, వంబరవిల్లి అక్కమ్మ, సిరిపురం జ్యోతి, భీష్మ సరోజిని ఎంపికై, బహుమతులను పొందారు. రెండవ బ్యాచ్ నుంచి సవిరగాన లత, అలజంగి మౌనిక, టెక్కలి విజయలక్ష్మి, కొంచాడ సత్యవతిలు విజేతలై బహుమతులు పొందారు. మూడవ బ్యాచ్ నుంచి సురవరపు అశ్విని, కూర్మాన రేవతి, అధికారి లలిత, పాత్రో పావనిలు గెలుపొంది బహుమతులు పొందారు. టగాఫ్ వార్ పోటీల్లో జయరాజ్, నవీన్, ప్రదీప్, లక్ష్మీనారాయణ, నరేష్, రవితేజ, గోపాలరావు, మనోజ్, సింహాద్రి, అప్పారావుల టీమ్ విజేతలుగా నిలిచారు. విద్యా సామర్థ్యాలలో, సాంస్కృతిక కార్యక్రమాలో, క్రీడా నైపుణ్యాలలో, క్రమశిక్షణలో మిక్కిలి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలను, షీల్డ్ లను అతిథులుగా విచ్చేసిన సచివాలయం కార్యదర్శి జన్నిచంద్రమ్మ, విశ్రాంత విఆర్వో బలగ అప్పారావు నాయుడు తదితరుల చేతులమీదుగా అందజేసారు. సర్పంచ్ ఎద్దు చామంతమ్మ మాట్లాడుతూ విద్యార్థులంతా చదువులతో పాటు నైతిక విలువల పట్ల కూడా పూర్తి అవగాహన కలిగియుండాలని అలాంటప్పుడే మంచి జీవితాన్ని పొందగలరని అన్నారు. ఉపసర్పంచ్ డోల చిన్నారావు మాట్లాడుతూ విద్యార్ధుల క్రమశిక్షణతో మెలిగి విద్యను అభ్యసించిననాడే దేశాభివృద్ధికి దోహదపడగలరని అన్నారు. స్థానిక ప్రజానేత ఎద్దు సంతోష్ కుమార్ మాట్లాడుతూ విద్యా స్థాయిలో వెనుకబడిన విద్యార్థులకు అదనపు సమయాల్లో అదనపు తరగతులను ప్రతీరోజూ నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్ పర్సన్ బలగ బలగ రజనీకుమారి మాట్లాడుతూ గుణాత్మక విద్యాసాధనకై ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని, అవసరమైన సౌకర్యాలు సమకూర్చి తమవంతు సహకరిస్తామని అన్నారు.
వైస్ చైర్మన్ గేదెల తేజేశ్వరరావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి బాల్యం నుంచి వినయ విధేయతలను అలవరచుకోవాలని అన్నారు. విద్యార్థుల సమగ్ర ప్రగతి పత్రాలను తల్లిదండ్రులకు అందజేసి విద్యార్థుల చదువుల స్థాయిని ముఖాముఖి చర్చలు జరిపి తగు సమీక్ష నిర్వహించారు.
సచివాలయ విద్యా సంక్షేమ కార్యదర్శి బి.సుధాకర్ మాట్లాడుతూ తరచుగా పాఠశాలను సందర్శిస్తూయున్నానని, మధ్యాహ్న భోజన పథకం మెనూ పాటించడంలోనూ, పౌష్టికాహారంతో పాటు, రుచికరమైన, శుచి శుభ్రతతో కూడిన విధానాలను పరిశీలిస్తున్నానని పూర్తి సంతృప్తి కలిగియున్నానని అన్నారు. మహిళా రక్షణ విభాగ కార్యదర్శిణి పడాల తేజస్విని సైబర్ నేరాలకు బలి కాకుండా ఉండేలా ఏమేమి జాగ్రత్తలు వహించాలో వివరించారు. పూర్వ విద్యార్ధిణి వై.కోటేశ్వరి మాట్లాడుతూ ఈ పాఠశాలలో తాను సాధించిన విద్యా ప్రమాణాల ఫలితంగా నేడు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న శిక్షణార్ధినయ్యానని త్వరలోనే ఉద్యోగినై సామాజిక బాధ్యతలో పాలుపంచుకుంటానని అన్నారు.
తల్లులలో ఒకరైన బి.ఆర్.కుమారి వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించి, సభను రంజింపజేసారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు ప్రత్యేక గీతాలను అందించగా బాలబాలికలు మిక్కిలి ప్రతిభాపాటవాలను ప్రదర్శించి సభకు శోభాయమానంగా నిలిచారు.
విద్యాశాఖకు సంబంధించిన నినాదాలను, పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాల పత్రాలను, విద్యార్థులు రూపొందించిన బోధనాభ్యసనా సామాగ్రిని ప్రదర్శించగా హాజరైన తల్లిదండ్రులు ఇతర పౌరులంతా తమ హర్షాతిరేకాలు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు తాము బాధ్యత వహిస్తున్న తమ తమ తరగతి గదులను ఆహ్లాదకరమైన వాతావరణంలో అలంకరణ గావించారు. అలాగే ఆయా తరగతుల విద్యార్థుల స్థాయిని సభ దృష్టికి తెచ్చీ, తల్లిదండ్రులకు పలు సూచనలు గావించారు. విద్యార్థుల ప్రగతి పత్రాలను తల్లిదండ్రులకు చూపి వారి సామర్ధ్యాలను చర్చించడమైనది. తొలుత అతిథులు, ఉపాధ్యాయులు భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ కార్యక్రమంలో
అనంతరం విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అతిథులంతా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం భోజనాలను సహపంక్తి భోజనాలను ఆరగించి నేటి మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం వేడుకలను ముగించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి