ఆరంభ సూచిక ...!!: --డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 తల్లి గర్భంలో ఉండగానే 
తాతమనసు గ్రహించాడు ,
తాతనేకాదు ....
యావత్ కుటుంబాన్నీ
సంతోషంలో ముంచడానికి 
మగపిల్లాడై పుట్టి 
పుట్టకతోనే --
లక్షరూపాయల ప్రయిజ్ మనీ 
తాతదగ్గర -
సునాయసంగా కొట్టేశాడు !
సామాన్యుడుకాదు ...
నా మనవడు నివిన్ ,
'నికో ' వాడి ముద్దుపేరు !
విచిత్రంగా ,
మనవడు -
మాట్లాడిన మొదటి మాట 
" ఆమెన్ " ....
ఆశ్చర్యం ...క్రైస్తవ ప్రార్ధనలో 
ఇది ముంగింపు మాట !
భవిశ్యత్ క్రమశిక్షణజీవితానికి ,
ఆ ..మాట --
ఆరంభసూచికనేమో సుమా ..!!
                  ***
కామెంట్‌లు