ఖాళీ!!:- డా.ప్రతాప్ కౌటిళ్యా
మనల్ని మనం 
ఖాళీ చేసుకోవడం అంటే 
జ్ఞాపకాలను తొలగించటం!!?

జెనిటికల్ జ్ఞాపకాలను 
ఎలా తొలగించలేమో

మన జ్ఞాపకాలను కూడా 
తొలగించలేము!!? కానీ 

జ్ఞాపకాలు 
భావోద్వేగాలను కలిగిస్తాయి. 
కనుక 

భావోద్వేగాలకు 
స్పందించే 
గుణాన్ని తగ్గించుకుంటే 
జ్ఞాపకాలను తొలగించినట్లే!!

జెనెటికల్ జ్ఞాపకాలు కూడా 
పరిణామంలో 
ఇలాగే తొలగించుకున్నాయి.!!?

జ్ఞాపకం కోసం పరిణామం జరగలేదు. 
పరిస్థితులు పరిణామానికి మూలం. 
పరిస్థితులన్నీ జ్ఞాపకాలు కావు 
మనుగడ కోసం మారినవి జ్ఞాపకాలు. 

ఆ జ్ఞాపకాలు చివరివరకు మిగలవు. 
కొన్ని మాత్రమే కొనసాగుతాయి. 
పరిణామం అధికారం కాదు. 
జ్ఞాపకాలు అవసరం లేదు. 
అవసరమున్నయే చివరివరకు మిగిలేవి. 
ఆ జ్ఞాపకమే మనం.!!!?

డా.ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు