అనగనగా ఒక పాఠశాలలో 8 మంది స్నేహితులు ఉండేవారు, వారు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు కానీ ఒకరోజు ఒక అమ్మాయిని అపార్థంగా ఊహించుకున్నారు, ఎనిమిది మంది స్నేహితులలో ఒక అమ్మాయిని విడదీశారు, ఆ అమ్మాయి చాలా బాధపడ్డారు, అందరూ మరుసటి రోజు బడికి వచ్చి ఎగ్జామ్ హాల్ కి పోయారు, ఎప్పుడైనా మేము ఏ పని చేయాలన్నా ఎనిమిది మంది కలిసి చేసేవాళ్ళం ,కానీ ఆరోజు ఏడుగురమే వెళ్ళాము,మాకు చాలా బాధేసింది ఆ అమ్మాయి కూడా మాకంటే చాలా బాధపడింది, అప్పుడే మేము ఎగ్జామ్ హాల్ కి వెళ్తున్నాము, అప్పుడు ఒక టీచర్ వచ్చి, మమ్మల్ని అడిగింది, ఏంటి మీరు ఏడుగురే వెళుతున్నారు, ఇంకొక అమ్మాయి ఎక్కడ అని ఆ టీచర్ మమ్మల్ని అడిగింది, అప్పుడు మేము టీచర్ కి బాధతో చెప్పాము,టీచర్ మేము, ఆ అమ్మాయి ఒక చిన్న అపార్థంతో విడిపోయాము ,అప్పుడు మా టీచర్ కొన్ని మంచి మాటలు చెప్పింది,ఆ టీచర్ చెప్పిన మాటలకు చాలా బాధేసింది, ఏంటి అంటే ఎప్పుడైనా అందరూ కలిసి మెలిసి ఉండాలి, ఒకరిని ఒకరు అలా అపార్థం చేసుకుంటే మీరు ఎలా కలిసి ఉండగలుగుతారు సమాజంలో, కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉంటేనే కదా సంతోషంగా ఉంటారు, ఇకనుంచి అందరూ కలిసిమెలిసి ఉండాలి, మాకు ఆ టీచర్ చెప్పిన మాటలకు, మేము ఆ అమ్మాయి దగ్గరికి అందరం వెళ్ళాము, వెళ్లి ఆ అమ్మాయి తోటి మేము, నిన్ను ఇంకా ఎప్పుడు బాధ పెట్టము, మమ్మల్ని క్షమించుము అని వేడుకున్నాము, ఆ అమ్మాయి కూడా మమ్మల్ని అర్థం చేసుకొని అపార్థం చేసుకోకుండా, మమ్మల్ని కూడా క్షమించడం జరిగింది. అప్పటినుండి మేము అందరం కలిసి మెలిసి ఉంటున్నాము ,ఇది మా ఎనిమిది మంది అమ్మాయిల యొక్క మంచితనం.
ఈ కథలోని నీతి: కలిసి ఉంటే కలదు సుఖం
ఈ కథలోని నీతి: కలిసి ఉంటే కలదు సుఖం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి