అనగనగా ఒక ఊరిలో ఒక ముసలి ఆమె ఉండేది, ఆమెకు ఒక కొడుకు కోడలు మనవడు ఉన్నారు, ఆ ముసలి ఆమె పేరు లక్ష్మి, తన కొడుకు పేరు రామయ్య, తన కోడలు పేరు కవిత, తన మనవడి పేరు శివ, ఆమెకు కళ్ళు కనిపించవు దానివల్ల ఆమె ఏ పని చేసుకోలేదు, తన కోడలు చాలా చెడ్డది,ఆమె రోజు బాధపడేది తన మనవడు చాలా మంచివాడు, తన నాయనమ్మకు సేవలు చేసేవాడు, దానివల్ల తన నాయనమ్మ తనని చాలా ప్రేమగా చూసుకునేది, అతనిది ఒక పేద కుటుంబం, అందువల్ల రామయ్య ఒక రైతు, అందువల్ల ఎప్పుడూ బాగా కష్టపడేవాడు, తన కొడుకు బడికి వెళ్లేవాడు, అతడు చాలా బాగా చదువుకునే వాడు, ఇద్దరూ లేనిది చూసి తన అత్తని బాగా కొడుతుంది, అంతలో తన మనవడు వచ్చాడు, కొట్టేది చూసి తన అమ్మను ఆపాడు బాగా గాయాలు అయినాయి, అప్పుడే తన కొడుకు వచ్చాడు, వచ్చి ఏమైందమ్మా అని అన్నాడు, తన కొడుకు శివ జరిగిందంతా చెప్పాడు, అందువల్ల తన భార్యని తిట్టాడు అందువల్ల తన అమ్మను హాస్పిటల్కి తీసుకువెళ్లారు, అయితే డాక్టర్ మందులు ఇచ్చాడు వాళ్ళు ఇంటికి వచ్చారు, తన భార్య అయినా కవిత క్షమాపణ అడిగింది, అయితే తన అమ్మ అయినా లక్ష్మి సరేలే సరేలే అమ్మ అని అన్నది, తన కోడలు తనని బాగా చూసుకుంటుంది, ఇప్పుడు అందరూ కలిసిమెలిసి ఉన్నారు.
నీతి: పెద్దలకు సహాయం చేస్తే మనకు తగిన గౌరవం ఉంటుంది.
నీతి: పెద్దలకు సహాయం చేస్తే మనకు తగిన గౌరవం ఉంటుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి