ఊరు గాలి ఈల:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
మట్టి మల్లెల సిరులే  ఊరంతా
పెద్దవాగు తొవ్వల్ల చౌరస్తా కచీరు 
సడుగు చెరువు ఎదురుగడ్డ బడి నా నడక

మూటలు విప్పిన చేతివృత్తుల పని పాట
చేతుల ఆకలిదప్పులు తీర్చిన దరువులు
కడలి ఈదిన తీరం ఊరూ వాడ

మాటా మనసూ పలికిన సంతసం
భక్తీ భయమూ చెలగిన మట్టిబాట
తృప్తిదీర బతికిన ఏరువాక ధాన్యసీమ 

కూరగాయల ఆకుపచ్చ మన్ను మనసు
తీగపాకిన గుమ్మడి పందిరి నీడ
కడుపు నింపిన బ్రహ్మ కాపుదనపు కొమ్మ

మనిషి మనిషీలోన మమకార వాన
లోన బైట ఒక్కతీరైన అలల కలలు
మధుపం వాలిన పుష్పసుధల ప్రేమ లోగిలి

వరసలు వరుసగట్టిన బాంధాలు
అక్కాచెల్లెలు వదినమరదళ్ళ సందడి
అన్నదమ్ముల అంతరంగాల జీవించె ఊరు

ఊరువాడల పుట్టి పెరిగిన జీవులు 
మనిషి మనసుల చుట్టే జానపద కళలు
ఆటపాటల అలాయి బలాయి ఊరు సన్నాయి

===================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Great application of language, images and expression of love for the mother land. salutes to the poet