భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
అమ్మ ఆయన బలం 
అమ్మ కల ఆయన కలం 
సంభాషణ ఆయన పౌరుషం 
మాతృభాషా భూషణం 
మన నాగభూషణం!!!!!!

ఒకధిక్కారస్వరం అతను 
అధికారం ఆయనకు ఒక వరం 
అతను ఒక చతుర్ముఖ సింహం 
స్నేహం ఆతనీ ఊపిరి!!
ఆయన ఊహ ప్రవాహం ఒక పద్మ వ్యూహం. 
అతడే ఏసీపి నాగభూషణం.!!

ఆయనొక చెమట గంధం 
ఆయన ఒక ప్రబంధం ఒక ప్రేమ గ్రంథం.!!
సిల్వర్ జూబ్లీ ముత్యం 
ఆయన ఒక సత్యం 
అధర్మం మాయా మర్మం విప్పిన ఒక ధర్మం అతను. 
అతడే ఏసీపీ నాగభూషణం.!!

ఆయుధం ధరించని యాదవుడు కాదు 
చదువు 
ఆయుధంగా ధరించిన ఒక యోధుడు. 

ధనం కాదు ఆతని నినాదం!
మనం ఆతని విధానం!!
నిజాయితీ ఆతని ధనం!!
అతడే మా ఏసీపి నాగభూషణం!!!

సిల్వర్ జూబ్లీ కళాశాల ఆత్మీయ మిత్రుడు గౌరవనీయులు ఏసీపీ నాగభూషణం గారికి ప్రేమతో 

డా.ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు