కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య మరుసటి రోజు పోలి పాడ్యమిగా జరుపుకుంటారు. నవంబర్ 30 వ తేదీ కార్తిక అమావాస్య ఉదయం 10:30 నిమిషాల నుంచి మరుసటి రోజు అంటే డిసెంబర్ 1 వ తేదీ ఉదయం 11:51 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయంతో పాడ్యమి తిథి ఉన్న రోజునే పోలి పాడ్యమి జరుపుకోవాలి కాబట్టి డిసెంబర్ 2వ తేదీ సోమవారం రోజు పోలి పాడ్యమి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.కార్తిక మాసం నెలరోజులు పుణ్య స్నానాలు చేసిన భక్తులు.. కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భక్తులు పోలిని స్వర్గానికి పంపారు. నదీ స్నానమాచరించి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి, నదిలో విడిచిపెట్టారు.ఈ రోజు పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు. ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు స్నానమాచరించి.. నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. దీప దానం కూడా చేస్తారు.చివరి రోజు శివాలయానికి వెళ్ళి మహాశివునికి అభిషేకాలు, పూజలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. అలాగే పోలి పాడ్యమి రోజు 30 వత్తులతో దీపాలను వెలిగిస్తారు. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అనంతరం మూడు సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకుని పోలి స్వర్గం కథ వింటారు.పోలి పాడ్యమి రోజు 30 వత్తులతో దీపం వెలిగించాలని శాస్త్ర పండితులు చెబుతారు. దీని వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం కలుగుతుందని అంటారు. అలాగే ఈ రోజు దీప దానం చేయడం కూడా చాలా మంచిదని వారు వివరిస్తున్నారు.
పురాణాల ప్రకారం పోలి కథ ఈ విధంగా వుంది.
ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. కానీ అది ఆమె అత్తకు అసలు నచ్చేది కాదు. అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్లతో పూజలు, వ్రతాలు చేయించేది. కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలిని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకెళ్లింది.
చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు. కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకుని వత్తులు చేసుకునేది. కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికి కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది. ఇలా కార్తీకమాసం అంతా చేసింది. మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్ళతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది. కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించింది.
ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు. ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు. గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త, మిగతా కోడళ్ళు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు. కానీ వాళ్ళను కాకుండా పోలిని తీసుకెళ్తుంటే అత్త, తోడి కోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకుని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని తీసుకెళ్లారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి