అనాధశిశువు
అగుపించితే
ఆరాటపడతా
అండగానిలుస్తా
అంగవికులుడు
ఎదురొస్తే
అలమటిస్తా
చేయూతనిస్తా
ఆకలికొన్నవాడు
అయ్యాసాయమంటే
ఆదుర్దాపడతా
ఆర్ధికసాయమందిస్తా
అక్కుపక్షి
అలమటిస్తుంటే
అశ్రువులుకారుస్తా
అంతర్యామినినిందిస్తా
అవివేకుడు
తారసపడితే
చేరదీస్తా
ఙ్ఞానభొధచేస్తా
అమాయకుడు
అభ్యర్ధిస్తే
సలహాలిస్తా
సన్మార్గంచూపిస్తా
అమానుషుడు
అవధులుదాటుతుంటే
అడ్డగిస్తా
అంతరంగాన్నిమారుస్తా
అబల
అభ్యర్ధిస్తే
ఆశ్రమమిస్తా
ఆసరాకలిపిస్తా
అందరమూ
ఆత్మీయులమంటా
వసుధంతా
ఒకేకుటుంబమంటా
అవనిని
అపరస్వర్గంచేద్దాం
అందరిని
అన్యోన్యంగామెలగమందాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి