శివానందలహరి:-కొప్పరపు తాయారు

 శ్లో:! కర లగ్న మృగః  కీరంద్ర భంగో
       ఘన శార్దూల  విఖండనో  స్తజంతుః.
        గిరిశో విశదాకృతిశ్చ  చేతః
        కుహరే  పంచముఖోస్తి మే కుతో  భీరి!!

భావం: మృగమును చేతిలో
ధరించిన వాడునూ,
గజాసురుని సంహరించినవాడునూ, వ్యాఘ్రాసురుని ఖండించిన వాడునూ, జంతువులు అన్నియూ లయము చెందిన వాడునూ, కొండలో నివసించువాడునూ, తెల్లని శరీరము కలవాడునూ, పంచముఖుడు అయిన
శివుడు, నా హృదయమందే నివసించుచున్నాడు. 
ఇక నాకు భయము ఎక్కడిది ?
                      ******

కామెంట్‌లు