శ్లో:! చందశ్శాఖి శిఖాన్వితై ర్ద్విజవరై స్సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే
చేతఃపక్షి శిఖామణే త్యజ వృధా సంచార మన్యైరలం
నిత్యం శంకర పాద పద్మ యుగళీ నీడే విహారం కురు !!
భావం: మనసు అనే ఓ పక్షి శ్రేష్టమా! వేదములు అనే వృక్షముల చిట్టచివరి కొమ్మలతో సంబంధం కలిగి బ్రాహ్మణ వర్యులతో సేవించబడేది, స్థిరమైనది, సౌఖ్యమైనది, అమృతము వంటి సారము గల ఫలములతో ప్రకాశించినది, దుఃఖమును తొలగించేది, సుఖములు కలుగజేయునది అగు శివుని పాధ పద్మ యుగళము అనే గూటి యందు ఎల్లప్పుడూ విహరించు... ఇతరములు వలదు, వ్యర్థ సంచారము విడిచిపెట్టుము.
****
శివానందలహరి:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి