మదిని పరిమళం తో నింపుతూ
మనసు చూరు నుండీ
జారే మకరందపు ధారలే
మాయని మమతలంటే!
వెళ్ళలేనంత దూరంలో ఉన్నా
అసలు కలవక పోయినా
పలకరింపులు లేకపోయినా
పదిలంగా పెరిగేదే ప్రేమంటే!
మరువనివ్వని జ్ఞాపకాలు
చెరువులోని అలలలాగా
వెలుపలికి రాలేక లోలోపలే
సుడులు తిరిగేవే సంతోషాలంటే!
ఎదలోయలలో ప్రతిధ్వనించే
ఎల్లలెరుగని మౌనంలో
తలపు తీగలు మీటి పోయే
హృదయ రాగం సంగీతమంటే!
దారిచేసుకుని చేరిపోయే
కాంతిరేఖల వెలుగులో
చీకటిని తరిమేసే చిత్తాన
మెరిసే మెరుపే ఆశంటే!
చిరు వెలుతురు పంచే
గోరువెచ్చని స్పర్శతో
మురిపించి మరిపించే
మాయేలే వేకువంటే!
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి