ముఖ పుస్తకాన్ని నమ్ముతున్నాం!
పుస్తకాన్ని నమ్ముతున్నాం!!
పుస్తకాన్ని అమ్ముతున్నాం!!!
కానీ
జాతి ముఖ పుస్తకం-రాజ్యాంగం
దాన్ని అమ్ముతున్నాం!!
రాజ్యాంగాన్ని నమ్మండి!
రాజ్యాంగాన్ని అమ్మకండి!!
రాజ్యాంగాన్ని అమ్మితే
కొనగలిగినవాడు- ధనవంతుడు!!
కొనలేని వాడు -సామాన్యుడు!!?
కానీ
రాజ్యాంగాన్ని నమ్మినవాడు- సంపన్నుడు !!
రాజ్యాంగాన్ని నమ్మని వాడు-సామాన్యుడు!
రాజ్యాంగం రక్షించేది- ప్రభుత్వాన్నే కాదు
పంచభూతాలను కూడా!!
మనం రాజ్యాంగాన్ని రక్షిద్దాం!
రాజ్యాంగం మనల్ని రక్షిస్తుంది!!
రాజ్యాంగం
ఒక - లా-ఒక- చట్టం-ఒక లాజిక్!!
రాజ్యాంగం
సామాన్యులకు-ఒక అల్లావుద్దీన్ అద్భుతదీపం!!
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి