వేదం!!!ఆ దీపం!!:-డా.ప్రతాప్ కౌటిళ్యా.
ఒక ఇంటి దీపం ఆరిన
వీధిదీపాలు వెలుగుతూనే ఉన్నాయి.!

వేలదీపాలను వెలిగించి విధిని ధిక్కరించిందేమో.!!
మెరుపు ఒకటి ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసింది.!!

చీకటి వెలుగులు ఆకాశమార్గం గుండా కన్నీటి మేఘాలై గడ్డ కడుతున్నాయి.!?

చూపులు లేని కళ్ళు రాత్రింబవళ్లు నిరీక్షించి నిద్రపోతున్నాయి.!!
సాగదీసిన బంగారు తీగ లాంటి నది ఒకటి -నాగరికత కోసం అంతరించిపోయింది.!!

దుఃఖం ముందు ముందు దరిద్రం దాక్కున్నట్లు 
కడుపులో కోపం ఆకలిగొని అలిగింది!!

దాహాన్ని తీర్చని సముద్రంలా ప్రేమ రూపం మార్చుకొని పేగు బంధాన్ని తెంచింది.!!

ముడివేసిన నగుమోము చిరునవ్వుల వెలుగుల్లో తెగిపోయి తెల్లారింది.!!!
అంధకార అధికార దీపం శిల్పంలా చెక్కబడ్డది.!!!

చరిత్ర మరిచిన స్మశానం ఆ నలుగురీ గోస్టి లో దృష్టిని కోల్పోయింది!!

వెక్కిరించిన అహంకారం వేయితలల సర్పంతో పోరాడి గెలిచింది.!!
ఎప్పటికైనా నిన్ను వెలివేస్తానని మాట ఇచ్చిన ఆ సుడిగాలి 
చిట్టచివరికి కోటి దీపాలను చుట్టేసింది.!!

స్నేహం మొలిచి మొలిచి అలసిపోయి పాములా మారిపోయింది.!!!?

వేదం కన్న -శబ్దం -దృశ్యం ముందు అదృశ్యమైపోయింది.!!
దీపం కాదది ఒక వేదం!!!!

ప్రొఫెసర్ జ్యోతి డీన్ కాకతీయ యూనివర్సిటీ గారికి నివాళి.

డా.ప్రతాప్ కౌటిళ్యా

కామెంట్‌లు