తెలంగాణ రాష్ట్రానికీ ఉన్నత రాజకీయ పాఠశాలలు. అవసరం.!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
 గ్రామీణ యువత ముఖ్యంగా ఉన్నత పాఠశాల వరకు మాత్రమే చదువుకుంటున్నారు. కొంతమంది ఉన్నత విద్యావంతులైన కూడా ఉపాధి నైపుణ్యాలు లేక వాళ్ల అంతర్గత శక్తులను వృధా చేసుకుంటూ ముఖ్యంగా జూదము మధ్యము వ్యభిచారం దొంగతనము వంటి చెడు అలవాట్లకు గురవుతున్నారు. వీళ్లను బాగు చేయడం ఎవరివల్లా కాదు. స్వార్థపరులు రాజకీయ పార్టీలు స్వార్థంతో వాళ్లను మరింత తప్పుదారి పట్టించి అసాంఘిక శక్తులుగా మారుస్తున్నారు. 
అందుకే రాష్ట్ర ప్రభుత్వం వీళ్లను సరైన మార్గంలో నడిపించి బాధ్యతాయుత యువ సమాజాన్ని నిర్మించడం కోసం రాజకీయ ఉన్నత పాఠశాలలు నెలకొల్పి, వాళ్లకు రాజకీయ శిక్షణ ఇస్తే తప్పకుండా వాళ్లు లోకల్ బాడీ వ్యవస్థలలో పనిచేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. 
ముఖ్యంగా రాజకీయ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగం చట్టం సమాజం వ్యవస్థ రాజకీయం గురించి శిక్షణ బోధన చేసి ఒక సర్టిఫికెట్ తో పాటు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ రాజకీయాలపై పూర్తి అవగాహనను కల్పించి, ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ భాషలను నేర్పించి వాళ్లను మూడు భాషల్లో మంచి వక్తలుగా తీర్చిదిద్దితే. తప్పకుండా వాళ్లకు గ్రామీణ స్థాయిలో పట్టణ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు నిపుణులైన కార్యకర్తలుగా గుర్తించి ప్రతి రాజకీయ పార్టీ వాళ్లకు తప్పకుండా తగిన ఉపాధి కల్పించడమే కాక శాస్త్రీయ చట్టపరమైన బాధ్యతలను అప్పగించి మంచి రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే అవకాశం అన్ని సిద్ధాంతాల ప్రాంతీయ జాతీయ పార్టీలకు కలగడం ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఉన్నత రాజకీయ పాఠశాలలను నెలకొల్పి, వాటిని ఉన్నత పాఠశాలలకు అప్పగిస్తే సరిపోతుంది. లేదంటే స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి రెండేళ్ల అకాడమిక్ రాజకీయ ఉన్నత పాఠశాలలు నెలకొల్పి వివిధ రాజకీయ పార్టీల నాయకులు నిపుణులతో వయోజనులకు యువకులకు శిక్షణ ఇప్పిస్తే సమాజం గొప్ప నాయకులను కార్యకర్తలను పొంది శాస్త్రీయ రాజకీయాలు నడిపే అవకాశం నేర్పు ఈ రాజకీయ పాఠశాలలకు ఉంటుందని మనవి. ఇది నమ్మండి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. 
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి. 
డా.ప్రతాప్ కౌటిళ్యా
రిటైర్డ్ లెక్చరర్ టీచర్స్ కాలనీ పాలెం-509215. ఫోన్ 8309529273.

కామెంట్‌లు