రిపబ్లిక్ డే ను గణతంత్ర దినోత్సవం అని కూడా పిలుచుకుంటాం మనం. ఒకప్పుడు భారతదేశంలో కూడా బ్రిటీష్ వారికి పూర్వం అనేక గణరాజ్యాలు ఉండేవి వాటిని సామంత రాజులు పాలించేవారు. వీరందరికీ ఒక చక్రవర్తి సార్వభౌముడిగా ఉండేవారు. సామంత రాజులు చక్రవర్తికి కప్పం కట్టి కొంత ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించుకునేవారు. యుద్దాలు వచ్చినప్పుడు చక్రవర్తికి అవసరమైనప్పుడు , సామంత రాజులు సైన్యాన్ని సహకారం గా అందించేవారు.
ఆ కొనసాగింపు మనకు స్వతంత్రం వచ్చే వరకు కూడా కొనసాగింది.దేశంలో తరువాత వాటిని సంస్థానాలు అని పిలిచేవారు, అవి స్వతంత్ర రాజ్యాలుగా ఉండేవి. వాటితో పాటు మిగిలినటువంటి రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదంతా కలిసి భారత్ యూనియన్ గా ఏర్పడడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశ అనేక రాష్ట్రాలతో కలిసి ఉంది. అందుకే దానిని గణతంత్ర రాజ్యం అంటాము. (రాష్ట్రాల కలయిక )రాజ్యాంగంలో కూడా మన దేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యoగా రాసుకున్నాము. అందువలన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ని మనమందరం గణతంత్రదినోత్సవం అని పిలుచుకుంటున్నాము.
జనవరి 26ను మనం గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటాం.ఇలాంటి రాజ్యాంగ రచన వెనక ఎంతో ఘనమైన చరిత్ర దాగి ఉన్నది.
భారత దేశంలోని ప్రజలు తమ హక్కుల ను ఈ మాత్రమైనా ఈనాడు స్వేచ్ఛగా అనుభవించగలుగుతున్నామన్నా, జంతువులు, పక్షులు ఇతర జీవరాసులు ఇంత బాగా సంరక్షణ పొందుతున్నాయన్నా, ప్రకృతి వనరులు బాగా కాపాడబడుతున్నాయన్నా దానంతటకీ ప్రధాన భూమికగా నిలిచినది, భారతీయులందరి జీవితాల్లో వెలుగు దివ్వెగా నిలిచినది, అదే మన భారత రాజ్యాంగం అనడంలో సందేహమే లేదు, అతిశయోక్తి కాదు.
రాజ్యాంగంనకు పూర్వం :-
------------------------------------ రాజ్యాంగానికి పూర్వము భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్లు వారి యొక్క ఆకాంక్షలకు ఆశలకు అనుగుణంగా మన దేశాన్ని ప్రజలను పాలించారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోచుకున్నారు, ప్రజలను బానిసలుగా చేసి పాలించారు అనడంలో సందేహమేమీ లేదు. కానీ వారు వచ్చిన తర్వాత వారి అవసరాల, స్వార్థం కోసమైనా మన దేశంలో అనేక రైల్వేలు, విద్యాలయాలు కట్టించారు. దానివలన మనకు కొంత సౌకర్యము, ఆనాటి సమాజంలో కింది వర్గాలుగా పిలవబడే వారు చదువుకోవడానికి అవకాశం కలిగింది. అప్పుడు ఆ వర్గం చదువుకోడానికి కొంత అవకాశం కలిగింది.
ఆనాడు సమాజంను ఒక వర్గం యొక్క సుఖం కోసం నాలుగు వర్గాలుగా విభజించి, ( బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ) కిందివర్గమైనటువంటి శూద్రులను చాలా నీచంగా హీనంగా చూసేవారు, వారికి కనీసం మంచి తిండి తినే అర్హత లేదు, మంచి బట్ట కట్టే అర్హత లేదు, చదువుకునే అరహత అనాడు అన్ని వర్గాల స్త్రీలకు, పురుషులైన శూద్రుల కు అర్హత లేదు. ఆనాడు బ్రిటిష్ వారు ఈ జాతి వివక్షణ చూసే మనం భారతీయులను పరిపాలించడం చాలా సులువు ఎందుకంటే వాళ్లలోనే వాళ్లకు ఐక్యత లేదు సమాజం అంతా విడిపోయి ఉన్నది అని అనుకున్నారు. అందుకనే మన దేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించగలిగారు. కానీ బదనాం మాత్రం ఆనాటి సమాజంలో ఉన్నత వర్గంగా చెప్పుకునే వారు విభజించు పాలించు అనేది బ్రిటిష్ వాళ్లు మనకు నేర్పారని బహుళ ప్రచారం చేశారు. ఇలాంటి అభియోగాలు ఆనాడు చాలా వరకు బ్రిటిష్ వారి మీద బాగా ప్రచారం చేశారు.
భారతదేశానికి బ్రిటిష్ వారి కంటే ముందు డచ్చు వారు పోర్చుగీసు వారు ఫ్రెంచ్ వారు వ్యాపారం కోసం రావడం జరిగింది. భారతీయ రాజుల్లో ఉన్నటువంటి అనైక్యతను ఆధారం చేసుకుని వారికి కొంత డబ్బు ఇచ్చి కొన్ని ప్రాంతాలను వ్యాపారస్థావరాలు గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు వ్యాపారాధిక్యత కోసం ఒకరి మధ్య ఒకరు ఎన్నో యుద్ధాలు చేసుకున్నారు. చివరికి ఆంగ్లేయులు వారి మీద ఆధిపత్యాన్ని సాధించగలిగారు. అటు తరువాత ఆర్థికంగా బలబడి సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అవసరమైన సమయాల్లో భారతీయ రాజులకే సైన్యాన్ని సహకారంగా అందించి వారి నుండి ఆర్థిక లాభం పొందే వారు. చివరికి భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని, స్వాధీనం చేసుకొని కంపెనీ పాలన అంతమై ఇంగ్లాండ్ సహకారంతో భారతదేశం మీద ప్రత్యక్ష ఆధిపత్యాన్ని సాధించారు. అలా వారు దాదాపు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు.
ఆ తర్వాత వారు భారతదేశంలో చేసినటువంటి దుష్కృత్యాలు చాలా ఉన్నాయి. వాటిని ఎదుర్కొని భారతదేశానికి స్వతంత్రం సాధించాలని ఉద్దేశంతో దేశంలోని మేధావులు, ప్రజలందరూ కలిసి స్వరాజ్య ఉద్యమం చేయడానికి పూనుకొని ఎన్నో పోరాటాలు చేసి అరెస్టులై ఉరి కంబాలు ఎక్కారు. ఈ స్వరాజ ఉద్యమం అనేది అతివాదులు మితవాదులు అని రెండు వర్గాలుగా పోరాడారు. చివరికి ఎంతోమంది వీరులు, యోధుల త్యాగల ఫలితం గా, వారి దాటికి తట్టుకోలేనటువంటి బ్రిటీష్ గవర్నర్ జనరల్ అట్లీ గారు మీకు 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వతంత్రం ఇస్తాం. కానీ మిమ్ములను మీరు పాలించుకోవడానికి అవసరమైనటువంటి చట్టాలను రూపొందించుకోవాల్సిందిగా సలహాలు సూచనలు ఇచ్చారు.
రాజ్యాంగ రచన :-
-----------------------
భారతదేశ ప్రజల ఆశలు ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని అనుకున్నారు భారతీయ మేధావులు. దానికోసం ముందుగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదే రాజ్యాంగ పరిషత్ ( కాన్స్టెన్సీ అసెంబ్లీ ), దానికి అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ని నియమించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో సబ్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అతి ముఖ్యమైన కమిటీ రాజ్యాంగ రచన కమిటీ, దానిని రాజ్యాంగ ముసాయిదా కమిటీ అని కూడా అంటారు. అయితే ఆనాడు ఈ రాజ్యాంగం రాయడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో ఒకరు బి.ఎన్. రావు ఒకరు. బి.యన్ రావు గారు రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడు అయ్యి రాజ్యాంగ రచన చేయాలని అనుకున్నాడు, అనుకున్నదే తడువుగా బి.యన్ రావు గారు కొంతమంది మేధావులని తీసుకొని అమెరికాకు క వెళ్లడం జరిగింది. అక్కడ అనేక రాజ్యాంగాలు రాసినటువంటి వ్యక్తి జేమ్స్ మెడిసన్ ని కలిసి మీరు మా దేశానికి రాజ్యాంగాన్ని రాసి ఇవ్వాలి అని అన్నారు.జేమ్స్ మెడిసన్ గారు మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఏ దేశం నుండి వచ్చారు అని అడిగారు, రావు గారు మేము భారతదేశం నుంచి వచ్చాము అన్నారు. అప్పుడు జేమ్స్ మెడిసన్ నేను రాసినటువంటి రాజ్యాంగాలకు అనేక సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తి రాజనీతి శాస్త్రం లో మంచిపట్టు ఉన్న వ్యక్తి, అనేక దేశ రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివిన వాడు అందులోని విషయాలను బాగా ఆకలింపు చేసుకున్న వాడు, పౌరశాస్త్రంలో నిపుణుడు అయినవారు మీ దేశంలోనే ఉన్నారు అన్నాడు. అప్పుడు రావు గారు ఎవరు అతను అని అడిగారు. అతను బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఏమి మారు మాట్లాడకుండా బి యన్ రావు గారు భారతదేశం తిరిగి వచ్చారు. కానీ ఆనాడు అస్పృశ్య కులాలలో పుట్టినటువంటి వ్యక్తిని రాజ్యాంగ రచన కమిటీ కి అధ్యక్షుడు గా చేయడం ఇష్టం లేదు. అయితే ఆనాడు రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షుడు కావాలంటే కాన్స్టెన్సీ అసెంబ్లీ కి సభ్యుడుగా ఎన్నిక కావాలి. అప్పుడు ఒక ప్రాంతం నుంచి అంబేద్కర్ గారు పోటీ చేయడం జరిగింది. అక్కడ అంబేద్కర్ గారు ఓటమి పాలు కావడం కూడా జరిగింది. ఆ తర్వాత మరల ఇంకో ప్రాంతం నుంచి పోటీ చేయడం జరిగింది. అక్కడ అంబేద్కర్ గారు గెలిచారు, కానీ ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ లో కలిపేశారు. అప్పుడు వెంటనే అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రధాని ని కలసి భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు న్యాయం జరగాలి, అన్ని రకాల హక్కులు పొందాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ రచన కమిటీలో నేను ఉండాలని కోరుతాడు, లేనట్లయితే నా జాతికి ఇంకా ఎప్పుడు న్యాయం జరగదు అని విన్నవించడం జరిగింది. వెంటనే బ్రిటిష్ పాలకుడు వెంటనే నెహ్రూ గారికి ఒక లేఖ రాశాడు.రాజ్యాంగ రచన కమిటీలో తప్పనిసరిగా అంబేద్కర్ గారు ఉండాలి లేనట్లయితే మేము స్వతంత్రం ఇవ్వమని ఒక లేఖ రాశారు. వెంటనే మేధావులు అందరూ కలిసి అప్పటికే పోటీ చేసి బెంగాల్ ప్రాంతంలో గెలిచినటువంటి వ్యక్తి జోగేంద్ర నాథ్ మండల్ గారిని రాజీనామా చేయించి అదే నియోజకవర్గ నుంచి అంబేద్కర్ గారిని పోటీ చేయించి గెలిపించడం జరిగింది. అప్పుడు కాన్స్టెన్సీ అసెంబ్లీలో సభ్యుడు అయ్యాడుఁ.
అప్పుడు ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచన కమిటీని ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్ గా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కమిటీకి సలహాదారుగా బి ఎన్ రావు గారు నియమించబడ్డారు. ఆ ముసాయిదా కమిటీకి నియమించినటువంటి ఏడుగురులో ఒకరు చనిపోయారు ఆ స్థానంలో ఎవరిని నియమించలేదు, ఇద్దరు సొంత పనుల మీద విదేశాలకు వెళ్లారు, మరో ఇద్దరు అనారోగ్యంతో ఉండి ఢిల్లీ దూరంగా ఉందని రాలేకపోయారు, ఒకరు స్థానిక రాజకీయాల్లో నిమగ్నమయ్యారు, మరొకరు ఇతర కారణాల వల్ల రాలేకపోయారు. చివరికి రాజ్యాంగ రచన భారం అంతా ఒక అంబేద్కర్ మీదనే పడింది. అంబేద్కర్ గారు అణగారిన వెనుకబడినటువంటి ప్రజలకు హక్కులు, అవకాశాలు కల్పించడానికి ఇదే సరైనటువంటి సమయం అనుకొని అనేక రాజ్యాంగాలు చదివి అవగాహన చేసుకొని, వాటిలో మన దేశ ప్రజలకు అవసరమైనటువంటి విషయాలను స్వీకరిస్తూ, అంత క్రితమే బ్రిటిష్ వారు భారతీయుల కోసం చేసినటువంటి చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం. అందులోనీ చాలా విషయాలను యధాతధంగా తీసుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగ రచన చేయడానికి రాత్రి పగలు అనే తేడా లేకుండా అనేక దేశాల రాజ్యాంగాలను తిరిగేసి, సమయానికి ఆహారం తీసుకోకుండా కూడా రాజ్యాంగాన్ని రాసి సిద్ధం చేయడం జరిగింది. ఈ రాసినటువంటి రాజ్యాంగాన్ని దేశంలో ప్రజలముందుంచారు. దానిపై అనేక చర్చలు జరిపి సలహాలు సూచనల చేయాలని, రాజ్యాంగ పరిషత్ కమిటీ లోని వారందరూ కోరడం జరిగింది. అనేక చర్చలు సలహాలు సూచనలు చేర్పులు మార్పులు అనంతరం నవంబర్ 26 1949 నాడు రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఆమోదించినటువంటి రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమలులోకి తీసుకు రావడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం గా గుర్తించబడింది. అందుకని మన రాజ్యాంగానికి గుర్తుగా ఏనుగును సూచించడం జరిగింది. ఎందుకంటే ఏనుగు అన్ని జంతువుల కంటే బలమైనటువంటిది కాబట్టి. అప్పటి నుండి జనవరి 26ను మనము గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇదే సమయంలో మనం రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఆగస్టు 15న జెండా ఎగరవేస్తాము, జనవరి 26న జెండా ఎగరేస్తాం. ఎందుకంటే ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన రోజు కనుక, జనవరి 26న రాజ్యాంగము అమలులోకి వచ్చిన రోజు కాబట్టి, రెండు సార్లు మనం పతాకావిష్కరణ చేస్తాం. ఈ రెండు సందర్భాలను తప్పనిసరిగా మనం గమనంలో ఉంచుకోవాలి.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఆరు సంవత్సరాల తర్వాత డిసెంబర్ 6న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ గారు సరైన సమయానికి ఆహారము మందులు అందక చక్కర వ్యాధితో అనారోగ్యానికి గురి అయ్యి పరమపదించారు.
ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ఎన్నో ప్రయాసలకోర్చి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాశారంటే అది వారికే సాధ్యం ఇంకెవరికి సాధ్యం కాదు అనడంలో అతిశయోక్తి లేదు.
ఇంత పెద్ద మన భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాయగలిగారంటే దానికి కారణం వారు చదివిన చదివే తగిన యోగ్యతని చెప్పకనే చెప్పవచ్చు.
అంబేద్కర్ గారు చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా వెనకడుగు వేయకుండా బాగా చదివి 32 డిగ్రీలు సంపాదించాడు. రెండు పీహెచ్‌డీలు చేసాడు. (సైన్స్, ఎకనామిక్స్ )లండన్ గ్రంధాలయంలో ఉన్నటువంటి 50 వేల పుస్తకాలు చదివినటువంటి వాడు. ఆనాడు అక్కడ అన్ని పుస్తకాలు చదివినటువంటి వారు నలుగురే ఉన్నారు అందులో ఇతను మూడవ వాడు ఆసియాలో మొదటివాడు. ఇప్పటివరకు కూడా ఇంత చదువు చదివినటువంటి వాళ్ళు మన భారత దేశంలో లేరు. అతను సొంతంగా ఒక గ్రంథాలయాన్ని బొంబాయిలో 2 అంతరాల భవనం లో 50 వేల పుస్తకాలతో ఏర్పాటు చేశాడు. అతను చదువుకునే రోజుల్లోనే ఏ దేశం వెళ్లినా కూడా అతను పుస్తకాల పెట్టెలతో తిరిగి వచ్చేవాడు, రాలేక పోతే ఓడలో ట్రాన్స్పోర్ట్ చేసేవాడు. ఒకసారి పుస్తకాలతో వస్తున్న ఓడ మునిగిపోయింది. అప్పుటి నుంచి అంబేద్కర్ గారు పుస్తకాల పెట్టెలకు ఇన్సూరెన్స్ కూడా చేసేవాడు.
అందుకనే ప్రపంచంలో ఎన్నో విశ్వవిద్యాలయాలలో అంబేద్కర్ గారు రాసినటువంటి పుస్తకాలను పాఠ్యపుస్తకాలుగా చేర్చుకోవడం జరిగింది. కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో అంబేద్కర్ గారి పేరుని ఒక బ్లాక్ కి పెట్టడం జరిగింది. అతను రాసినటువంటి ఎన్నో రచనలు ఎన్నో దేశాల విశ్వవిద్యాలయాలకు ఆధార గ్రంధాలుగా ఉన్నాయి. అందుకే ఐక్యరాజ్య సమితి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజుని వరల్డ్ నాలెడ్జ్ డే గా ప్రకటించింది. ( ప్రపంచ జ్ఞాన దినోత్సవం). అదేవిధంగా ఆనాడు ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే వ్యాసం రాసి రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు కు కారకుడయ్యాడు. జాతీయ పతాకంలో ధర్మచక్రాన్ని ప్రవేశపెట్టడానికి కారకుడయ్యాడు, కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలు ఉండడానికి కారకుడయ్యాడు. అంబేద్కర్ గారి సేవలు మన దేశం ప్రజలకు మర్చిపోలేనటువంటిది.
ఇప్పటికైనా భారత దేశంలో ఉన్నటువంటి యువత నేను పేదవాన్ని నేను ఏమి చేయలేను అని నిరాశ నుంచి బయటకు పడి అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్లాలి. ఆయన పడ్డ కష్టాల్లో మన కష్టాలు చాలా చాలా తక్కువ . కోరిక, నమ్మకం, ఆశ, నమ్మకం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడనేటువంటిది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి.
అన్నిటికంటే ముఖ్యమైనది లక్షల, కోట్ల ఆస్తి లేకపోయినా సరే గానీ మనకు చదువు ఉంటే అంతకంటే మించిన ధనము మనకు ఉన్నట్టే అని మనమందరం గ్రహించాలి.
ఈనాడు మనమంతా ఇంతమాత్రమైనా సమానత్వం స్వేచ్ఛ సోదర భావం, న్యాయం, హక్కులు అనుభవించగలుగుతున్నామంటే దానికి కారణం ఒకే ఒక్కటి అది రాజ్యాంగం మాత్రమే.
కానీ ఈనాడు రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని దాన్ని సరిగా అమలు జరపక దానికి తూట్లు పొడుస్తున్నారు. ఆ రాజ్యాంగమునకు బీటలు వారే సమయము ఆసన్న మైనది. కాబట్టి ఇప్పుడు మనం అందరం కలిసి మన భారత రాజ్యాంగంను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. ఒకవేళ మనం ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని ఇంకా కాపాడుకోలేకపోతే బ్రిటీష్ వారి కంటే ముందు మన దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో మళ్లీ అలాంటి పరిస్థితులువచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని మరల అమలు చేయాలని అనేక అదృష్ట శక్తులు కాచుకొని ఉన్నాయి. అదే జరిగితే మనకు ఇప్పుడు ఉన్నటువంటి హక్కులను పొందలేము, న్యాయం మనకు అందే పరిస్థితి ఉండదు. ( ఇప్పటికే అలాంటి పరిస్థితులు కొన్ని దాపరిస్తున్నాయి ).
అందుకే రాజ్యాంగ రక్షితో రక్షితః అనాలి. అలా కానట్లయితే దేశం లో ఎక్కువ శాతం ప్రజలు అధో గతి పాలవుతారు.
రిపబ్లిక్ డే - పూర్వోపరాలు :- నామ వెంకటేశ్వర్లు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, అటి పాముల, నల్గొండ జిల్లా, తెలంగాణ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి