అనగనగా హైదరాబాదులో లలిత, మనోహర్ అనే ఇద్దరు దంపతులు ఉన్నారు వాళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మొదటి వాని పేరు గౌతమ్ రెండో వాడి పేరు భార్గవ్ వాళ్ళ అమ్మానాన్న వాళ్లని ఎంతో గారాబంగా పెంచేవారు వాళ్లకి ఏదంటే అది కొనిస్తుండేవారు వాళ్లకి బయట తినడమంటే బాగా ఇష్టం ఎప్పుడు హోటల్ లోనూ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర కొనుక్కొని తినేవారు అలా వాళ్ల నాన్న మనోహర్ ఒకరోజు వాళ్ళిద్దరిని తీసుకొని బయటికి వెళ్ళాడు అలవాళ్లు బయటి ఫుడ్డు పానీ పూరి, నూడిల్స్, మెరిసే కవర్లలో దొరికే చిరుతిళ్లు , చాక్లెట్లు మొదలైన బయట దొరికే చెడు తిండ్లు కొనుక్కొని తినేవారు గౌతం బాగా చెడు తిండ్లు తినడం వల్ల అతనికి క్యాన్సర్ వస్తుంది. చాలా నీరసించి పోవడంతో బాగా ఫీవర్ రావడం తో వాళ్ల నాన్న హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు హాస్పటల్లో డాక్టర్ మీ వాడికి క్యాన్సర్ అని చెప్తాడు అది విని వాళ్ళ నాన్న చాలా బాధపడతాడు క్యాన్సర్ ఇంకా ఫస్ట్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఆపరేషన్ చేసి కొన్ని మందులు వాడితే తగ్గిపోతుంది అని చెప్తాడు అలా ఆపరేషన్ చేపించి ఆ మందులు డైలీ వాడడంతో అతని క్యాన్సర్ తగ్గుతుంది కానీ అలా జంక్ ఫుడ్ తినడం వల్లనే ఇలా అయ్యిందని వాళ్ళ నాన్న కూడా ఇంట్లో చేసిన ఫుడ్డు తప్ప బయట ఫుడ్ తినొద్దని చెప్తాడు. అది విని పిల్లలు కూడా సరే అని అంటారు. కానీ పిల్లలు అడిగినప్పుడల్లా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు తెలియకుండా డబ్బులు ఇచ్చేది. ఒకరోజు వాళ్ళ నాన్న చూసి పిల్లలకు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని కోపంగా ఆమె మీదికి అరుస్తాడు. పిల్లలు బయట కొనుక్కుంటా అంటే ఇచ్చాను అని చెప్పింది లలిత. అది విని మనోహర్ ఇంతకుముందే గౌతమ్ కి క్యాన్సర్ వచ్చింది మళ్లీ నువ్వు ఇలాంటి చెడు తిండ్లు అలవాటు ఎందుకు చేస్తున్నావ్ అని లలితను బాగా తిడతాడు మనోహర్ అప్పటినుండి వాళ్ళ అమ్మ కూడా పిల్లలకు డబ్బులు ఇవ్వకుండా జంక్ ఫుడ్ అలవాటు చేయకుండా ఇంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ మాత్రమే తినమని చెప్తుంది. అలా ఉండగా ఒక రోజు ఊరి నుండి మనోహర్ వాళ్ళ అమ్మ రాజవ్వ వస్తుంది. ఆరోజు మనోహర్ ఆఫీస్ కి వెళ్లాలని తయారయ్యి వెళ్ళాడు. లలిత వంటగదిలో వంట చేస్తూ ఉన్నది. పిల్లలు నాయనమ్మ దగ్గర కూర్చొని నాయనమ్మ మాకు ఊరు నుండి ఏం తెచ్చావు అని అడుగుతారు. అయ్యో నేను మీకు ఏం తేలేదు మనవల్లారా అని. ఇదిగో ఈ డబ్బులు తీసి ఏమైనా కొనుక్కోండి అని 500 తీసి వాళ్లకు ఇచ్చింది. దాన్ని తీసుకొని సంతోషంగా భార్గవ్ ఇంకా గౌతమ్ సంతోషంగా షాప్ కి వెళ్తారు వాళ్ళ నాన్న ఆఫీస్ కి వెళ్తుంటే షాప్ దగ్గర ఆగి చూస్తే వాళ్ల పిల్లలు గౌతం ఇంకా భార్గవ్ కనిపిస్తారు. మీరెందుకురా ఇలా వచ్చారు మీకు ఎవరు డబ్బులు ఇచ్చారు అని కోపంతో తిట్టాడు. దాంతో పిల్లలు డబ్బులు అక్కడే పడేసి ఏడుస్తూ వెళ్ళిపోతారు. సాయంత్రం మనోహర్ ఇంటికి వచ్చాక లలితను పిలుస్తాడు పిల్లలకు డబ్బులు ఇయ్యొద్దని నేను ఆరోజు చెప్పాను కదా మళ్లీ ఎందుకు ఇచ్చావు అని అరుస్తాడు. నేను డబ్బులు ఇవ్వడం ఏంటి నేను ఇయ్యలేదు కదా అని సమాధానం ఇస్తుంది. దాంతో ఆశ్చర్యపోయిన మనోహర్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా పిల్లలకి అని అడుగుతాడు? అవును నేనే ఇచ్చాను డబ్బులు 500 వాళ్లకి ఇచ్చాను ఎక్కడైనా పడేసారా అని అడిగింది రాజవ్వ. పిల్లలకి డబ్బులు ఎందుకు ఇస్తున్నావ్ అయినా నేను నీకు చెప్పడం మర్చిపోయాను కదా గౌతమ్ కి ఈ మధ్యనే క్యాన్సర్ వచ్చి తగ్గింది. డాక్టర్ చెడుతీన్లు తినొద్దని చెప్పారు. ఇప్పటినుండి మేము డబ్బులు ఇవ్వడం లేదు నువ్వు ఎందుకు ఇచ్చావు అని ప్రశ్నిస్తాడు వాళ్ళ అమ్మని? అయ్యో నాకు తెలవదు ఇంకోసారి పిల్లలకి పనిలో ఇంకేమైనా చేస్తాను కానీ ఇంకెప్పుడు డబ్బులు ఇవ్వను చెడు తిండ్లు అలవాటు చేయను అని సమాధానం ఇచ్చింది రాజవ్వ. ఇగో తీసుకో అని 500 వాళ్ళ అమ్మకి ఇచ్చాడు మనోహర్. పిల్లలు కూడా మేము జంక్ ఫుడ్ తినొద్దని అర్థం చేసుకొని అప్పటినుండి వాళ్ళు జంక్ ఫుడ్ తినడం మానేశారు.
జంక్ ఫుడ్ :- సాగర్ల శ్రీ వర్ధన్ - ఆరవ తరగతి- ఏకలవ్య ఫౌండేషన్ హై స్కూల్, శివాజీ నగర్- నల్గొండ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి