ఆకాశ పంజరంలో చిలుక కాదు
అస్థిపంజరంగా మారి భవిష్యత్తును సృష్టించి.
శూన్యంలో విత్తనాలు మొలకెత్తించింది
రక్త మాంసాలు కూడా తయారుచేస్తుంది ఆమె.!!?
పక్షిలా. ఎగిరింది గాలి
లేకున్నా
పక్షిలా ఎగిరింది
రెక్కలు లేకున్నా
అంతరిక్ష వృక్షం పై వాలింది.
వృక్షాన్ని రక్షించింది.!!!
ప్రపంచంలో మొదటిసారి
రక్త మాంసాలను కరిగించి
ఆకలిని జయించింది
దాహాన్ని జయించింది.
ఎడారి ఓడలా-అంతరిక్ష జాడలో
ప్రపంచంలో మొదటిసారి
అందరిలా కడుపు మాట కాదు
మెదడు చెప్పిన మాట విన్నది ఆమె!!
ఆమెనే
ఒక అంతరిక్ష పరిశోధన శాలగా మారి
దేహాన్నే అంతరిక్షంగా ఆవిష్కరించింది ఆమె.!!
పిల్లల్ని కనే యంత్రం మాత్రమే కాదు
ఆమె
అంతరిక్షాన్ని కన్నా అమ్మ ఆమె
ఆమె సునీతమ్మ!!!
పవిత్ర క్షేత్రం అంతరిక్షం
దాన్ని కన్న ఆమె నేత్రం భూమికి సాక్ష్యం!!!
చలనచిత్ర నాయిక చిత్రం
పడక గదుల్లో నగ్నంగా ఉంటుంది.
పడుపు గత్తే శరీరం
నడివీధుల్లో ఉంటుంది.
కానీ ఆడదాని శరీరం
ఒక అంతరిక్షం అని చెప్పిన
ఆమెనే సునీత విలియమ్స్!!!?
అంతరిక్ష వనిత సునీత విలియమ్స్ కు ప్రేమతో.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి