కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అధ్యక్షతన 1995-99 పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ఎంతో ఆత్మీయంగా ఆహ్లాదంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ పాతికేళ్ల క్రితం పదవతరగతి అభ్యసించిన విద్యార్థులంతా తమ తీపి గురుతులు నెమరు వేసుకుంటూ ఉల్లాసభరితంగా నేడు ఈ సమావేశం నిర్వహించుకోవడం ఎంతో ఆదర్శనీయమని అన్నారు.
నేటి ఈ పూర్వ విద్యార్థులకు ఆనాడు పాఠ్యబోధన జరిపిన ఉపాధ్యాయులు వై.ఎస్.ప్రకాశం, నేతేటి గణేశ్వరరావు, ఆర్.వి.రమణమూర్తి, రఘురామ మహంతి ముఖ్య అతిథులుగా వేదికనలంకరించి, ఆనాటి ఈనాటి కడుము పాఠశాల స్థితిగతులను వివరిస్తూ భావోద్వేగంతో ప్రసంగించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచ్ గుజ్జ రామారావు, ఎంపిటిసి వలురౌతు గోవిందరావు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ బూరాడ రమేష్, మాజీ సర్పంచ్ వలురౌతు ధర్మారావు, సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావులు వేదికనలంకరించి ప్రసంగించారు.
పూర్వ విద్యార్ధులంతా తమ తమ జీవితంలో అధిగమించిన అంశాలను, అనుభవాలను, ప్రస్తుతం ఎక్కడ ఎలా స్థిరపడ్డారో వేదికపై వివరించారు. తొలుత పాఠశాల ఆవరణలో గల గాంధీజీ, అంబేద్కర్, సరస్వతి, నటరాజ, పాఠశాల వ్యవస్థాపకులు వలురౌతు జగన్నాధం విగ్రహాలకు పూలమాలాలంకరణ గావించారు.
ప్రసంగాలు, పరిచయాల అనంతరం ఆనాటి ఉపాధ్యాయులు వై.ఎస్.ప్రకాశం, నేతేటి గణేశ్వరరావు, ఆర్.వి.రమణమూర్తి, రఘురామ మహంతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావులకు శాలువా, జ్ఞాపిక, పూలమొక్కలను బహూకరించి ఘనంగా సన్మానించారు. అలాగే సర్పంచ్ గుజ్జ రామారావు, ఎంపిటిసి వలురౌతు గోవిందరావు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ బూరాడ రమేష్, మాజీ సర్పంచ్ వలురౌతు ధర్మారావులను ఘనంగా సన్మానించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ అందరూ కేరింతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపారు. వారి వారి జీవిత భాగస్వామి, పిల్లలు ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ అపురూపమైన అనుభూతి పొందుతూ గడిపారు.
పూర్వ విద్యార్థులు గోవిందరావు, జగదీశ్వరరావు, శేషగిరిరావు, అచ్యుతరావు, ఫాల్గుణరావు, గోపాల్, మాలతి, సుహాసిని, శారద, కమలకుమారి, జయలక్ష్మి, మీనా, శశిభూషణరావు, మాధవరావు, తులసినాయుడు, షణ్ముఖ, చిన్నారావు, ఏకాశి, నూకయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్ధులు పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారాలను అందజేస్తామని అన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి