*జనవరి 18న నవోదయ ప్రవేశ పరీక్ష.
ఇలా చదివితే నవోదయలో సీటు మీదే
తడబాటు వద్దు ...లక్ష్యమే ముద్దు
అంటున్న ఇల్లూరి క్రాంతి కుమార్ ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల హుస్సేన్ పూర్
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మంచి అవకాశం.
విద్యాలయంలో ప్రవేశం కోసం వేలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతారు.
చిన్న వయసులోనే ప్రవేశపరీక్షలో పోటీపడి, విజేతలుగా నిలిచే అవకాశం.
సీటు రావడం అదృష్టంగా భావిస్తారు.
* భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభవంతులైన విద్యార్థుల కోసం, ఆర్థిక,సామాజిక,గ్రామీణ ప్రతికూలతల కారణంగా, వేగవంతమైన అభ్యాసనానికి ప్రాప్యత లేని,ప్రతిభవంతులైన విద్యార్థుల లక్ష్యంగా నడుపుతున్న కేంద్రీయ పాఠశాల వ్యవస్థ జవహర్ నవోదయ విద్యాలయాలు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది.ఒత్తిడి లేని చదువులు,ఆటపాటలతో,మానసిక ఉల్లాసానికి,విద్యా వికాసానికి కేంద్రంగా మారాయి.6వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నప్పటి నుండి కళాశాల(ఇంటర్మీడియట్ చివరి సంవత్సరంవరకు)పూర్తయ్యే వరకు విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నాయి.ఎందరో డాక్టర్లు, పోలీసు,సాంకేతిక నిపుణులు ఇతర ఉద్యోగాలు,ఇలా ఎందరినో అందించిన ఘన చరిత్ర జవహర్ నవోదయ విద్యాలయాలకు ఉంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను,వెలికి తీసి బంగారు భవిష్యత్తుకు మార్గం చూపిస్తున్నాయి.
నవోదయకు ఎంపిక కావడం ఇలా
ఈ విద్యాలయాలలో 6వ తరగతి నుంచి ఎంపిక పరీక్షలు ఉంటాయి. ఏదైనా ప్రభుత్వ,ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలలో 5వ తరగతి చదువుకున్న విద్యార్థులు నుంచి ప్రతి సంవత్సరం ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఒక్కొక్క విద్యాలయంలో 80 సీట్లలో గ్రామీణ విద్యార్థులకు 75% కాగా,మిగతా 25/. పట్టణ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.
దేశంలోని ఇతర విద్యాసంస్థల కంటే,జవహర్ నవోదయ విద్యాలయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం కృషి చేసే, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం ఉంటుంది.
ప్రవేశ పరీక్ష మూడు విభాగాలు.
మేధాశక్తి( మెంటల్ ఎబిలిటీ) పరీక్ష 40 ప్రశ్నలు,50 మార్కులు,60 నిమిషాలు.
గణితం 20 ప్రశ్నలు,25 మార్కులు, 30 నిమిషాలు.
భాషా నైపుణ్యానికి సంబంధించి 20 ప్రశ్నలు,25 మార్కులు,30 నిమిషాలు.
ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి.మొత్తం 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు మూడు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు.సమాధానాలు ఐసీఆర్ (ఇంటలిజెన్స్ క్యారెక్టర్ రికగ్నిషన్),ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్) షీట్లలో అంకెల రూపంలో గుర్తించాలి.నెగిటివ్ మార్కులు ఉండవు.
మూడు విభాగాల్లో పరీక్ష
ప్రవేశ పరీక్ష విరామం లేకుండా రెండుగంటలు కొనసాగుతుంది. వంద మార్కులకు 80 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉంటుంది.మూడు విభాగాలలో ఈ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు ఉంటుంది.రీజనింగ్ మేథాశక్తిలో 50మార్కులకు 40ప్రశ్నలు,గణితంలో 25 మార్కులకు 20 ప్రశ్నలు,తెలుగు లేదా ఆంగ్ల భాషలో నాలుగు పాసేజ్‌లు ఉంటాయి.ఒక్కో పాఠ్యాంశానికి ఐదు ప్రశ్నలు చొప్పన ఉంటాయి.వీటికి 25 మార్కులు ఉంటాయి.
మేధాశక్తికి అధిక మార్కులు.
మేధాశక్తి విభాగంలో 50 మార్కులు ఉంటాయి.బొమ్మలతో కూడిన ప్రశ్నలు ఉంటాయి.ప్రశ్న కింద నాలుగు సమాధానాలు బొమ్మల రూపంలో ఉంటాయి.ఈప్రక్రియలో సులభంగా మార్కులు పొందడానికి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సమయస్పూర్తితో ఆలోచించాల్సి ఉంటుంది.పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఇందులో సులువుగా 45 మార్కులు వరకు పొందే అవకాశం ఉంది.
గణితమే కీలకం.
గణిత విభాగంలో 20 ప్రశ్నలు ఉంటాయి.ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు వంతున,20 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి.గణితంలో ఐదోతరగతి వరకు గల అన్ని చాప్టర్లలో ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతారు.గణితoలో అధిక మార్కులు సంపాదించ గలిగే విద్యార్ధులు దాదాపుగా నవోదయలో సీటు పొందే అవకాశం ఉంది.
పఠనాసక్తి అంచనా.
భాష పఠనాశక్తిని అంచనా వేసేందుకు భాషా పరీక్ష నిర్వహించనున్నారు.ఈ ప్రశ్నలు 25 మార్కులకు ఉంటాయి.ఈ విభాగంలో ఐదు పాఠ్యాంశాలు ఇస్తారు.ఒక్కో పాఠ్యాంశంలో ఐదు ప్రశ్నలు వంతున నాలుగు పాఠ్యాంశాలలో 25 మార్కులు ఉంటాయి.పాఠ్యాంశాలు ఆధారంగా ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు అన్ని ఒకేలా ఉంటాయి.నిశితంగా గమనిస్తే సమాధానం కచ్చితంగా గుర్తించవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు.
పరీక్షలు రాసే వారందరూ చిన్నారులే కావడంతో,ఓసీఆర్ షీట్లలో సమాధానాలు గుర్తించాల్సి ఉండటంతో తడబాటు ఉంటుంది. తడబాటు తొలగించేలా ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి.
సమాధానాలు గుర్తించడానికి నీలి, నలుపు బాల్‌పెన్ను మాత్రమే వినియోగించాలి.రఫ్ వర్క్ చేయాల్సి వస్తే బుక్‌లెట్‌లో 16వ పేజీని వినియోగించుకోవాలి.వేరే పేజీలను వినియోగించవద్దు.
ఒక్కసారి సమాధానం రాసిన తర్వాత మార్చడం,కొట్టివేయడం, దిద్దడం చేయకూడదు.
ఒక ప్రశ్నకు సుమారు నిమిషం పడుతుంది.అందువల్ల అంతకంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు.
దాన్ని వదిలి,మరో ప్రశ్నకు జవాబు రాసే ప్రయత్నం చేయాలి.దీనివల్ల సమయం ఆదా అవుతుంది. నెగిటివ్ మార్కులు ఉండవు కాబట్టి,వదిలేసిన ప్రశ్నలుంటే అప్పుడు వాటిని ఆలోచించాలి.
బుక్‌లెట్‌లోని మూడు విభాగాల్లో అభ్యర్థులు ఉత్తీర్ణులు కావాల్సిందే. అందువల్ల అవసరానికి మించిన సమయం ఒక్కో విభాగంపై వృథా చేయరాదు. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి గంట కొడతారు.అది గమనించి పరీక్ష రాయాలి.
పరీక్షకు గంట ముందే ఆయా కేంద్రాలకు చేరుకోవాలి.పరీక్ష ప్రారంభమైన తరవాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రవేశ కేంద్రంలోనికి అనుమతించరు.
ప్రవేశ పరీక్ష :- జనవరి18 శనివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగును.
అభ్యర్థులకు సూచనలు.
పరీక్షకు వెళ్లేటప్పుడు హాల్ టిక్కెట్, ప్యాడ్,నీలం,నలుపు రంగు పెన్నులు తీసుకువెళ్లాలి. ప్రశ్నపత్రంలో అన్ని పేజీలు ప్రింట్, క్రమసంఖ్య,మీడియం సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి ఫ పరీక్ష కేంద్రానికి గంట ముందుగా వెళ్లాలి.ఓఎంఆర్ షీట్‌లో విద్యార్థి వివరాలు ఉంటాయి.వాటిని సరిచూసుకోవాలి.
ఇల్లూరి క్రాంతి కుమార్.
ప్రధానోపాధ్యాయుడు,
హుస్సేన్ పూర్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి