బస్సుల్లో గైడెన్స్!!! బాగుంటుంది!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా
 మహిళలను యువతను చైతన్యపరిచేందుకు-సాహితీవేత్తలు కళాకారులు యువ శాస్త్రవేత్తలు డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్లు లెక్చరర్లు నెలకు ఒకసారి బస్సుల్లో ప్రయాణం చేసి-ప్రయాణికుల్ని గమ్యం చేర్చే లోపు గంటకు ఒకరిద్దరు-వారి వారి వృత్తి నైపుణ్యాలను మార్గనిర్దేశకాన్ని ప్రజలతో పంచుకోవాల్సిందిగా మనవి. 
బస్సుల్లో గ్రామీణులే ప్రయాణించేది ఎక్కువ కాబట్టి, వాళ్ల వాళ్ల స్థాయిల్లో మార్గ నిర్దేశకత్వాన్ని సూచించాల్సిందిగా మనవి. విద్య వ్యాపారం వ్యవసాయం ఆరోగ్యం రాజకీయం శాస్త్ర విజ్ఞానం రంగాల్లో నిపుణులు భాగస్వామ్యం అయితే పల్లెలు పట్టణాల ఆంతర్యం తగ్గి సమయం వృధా కాకుండా సమాచారం వాళ్లకు చేరడమే కాక వ్యక్తిత్వ వికాసం చైతన్యం పెంపొందే అవకాశం ఉంటుంది. 
ఎక్స్ప్రెస్ డీలక్స్ బస్సుల్లో ఇది సాధ్యమవుతుంది. కానీ రాను రాను పల్లె బస్సుల్లో కూడా సౌకర్యంగా ఉంటుందేమో గమనించాలి. ఈ ఏర్పాటును రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చేస్తే బాగుంటుందని ప్రభుత్వం దృష్టికి వాళ్లు తీసుకెళ్లాల్సిందిగా మనవి. ఒకవేళ ప్రభుత్వం కాదంటే రాష్ట్ర ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మరియు నిపుణులు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా మనవి. 
సంక్రాంతి శుభాకాంక్షల తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి. 
డా.ప్రతాప్ కౌటిళ్యా
రిటైర్డ్ లెక్చరర్, టీచర్స్ కాలనీ పాలెం. 
509215. ఫోన్ 8309529273.

కామెంట్‌లు