ఇటీవల బ్రాహ్మణ సంక్షేమ వేదిక హైదరాబాదు వారు బ్రాహ్మణ చిన్నారులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. తేదీ.05-01-2025 నాడు జరిగిన బహుమతి ప్రదానోత్సవం లో గౌరవరాజు అమృతవర్షిణికి ద్వితీయ బహుమతి ప్రదానం చేశారు. “బ్రాహ్మణుల జీవనవిధానం & స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలు” అనే అంశంపై బ్రాహ్మణ చిన్నారులనుండి వ్యాసరచనను ఆహ్వానించి పరిశీలించి బహుమతులందించామని వేదిక అధ్యక్షులు బ్రహ్మశ్రీ బాలశ్రీనివాసులు గారు తెలియజేశారు.
గౌరవరాజు అమృతవర్షిణి నగరంలోని విజయ హైస్కూల్,కాప్రా లో 6వ తరగతి విద్యార్థిని. ఈ చిన్నారి చిత్రలేఖనం, గానం, నాట్యం లో కూడా తన ప్రతిభను ప్రదర్శించి పిన్నవయసులోనే అందరి మన్ననలు అందుకుంటున్నది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారు నిర్వహించిన వ్యాసరచనపోటీల్లో ద్వితీయ బహుమతి సాధించినందుకు ఆనందించి తోటి విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలిపారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి