కొత్త సంవత్సరం:- నామ వెంకటేశ్వర్లు, S A తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అయిటిపాముల,, నల్గొండ,

 వస్తుంది వస్తుంది కొత్త సంవత్సరం
 ఏం తెస్తుందో ఏం చేస్తుందో 
 వేచి చూద్దాం ఈ సంవత్సరం- 
 వరుణుడు కరుణించి అవనిని దీవించి 
 పచ్చని పైరులను పండించి 
 ప్రజలకు పట్టెడన్నమందిస్తుందో లేక \
ఆ ఫైరులనే హరించేస్తుందో.."వస్తుంది"
 ఆడంబరాలని ఆపిoచి          
భిక్షాటను తొలగించి 
 కరువు కోరల్ని పీకించి           
ఆకలి కేకలను ఆపేస్తుందో 
 కరెంట్ కష్టాలు తీరుస్తుందో       
కటిక చీకటికి నెట్టేస్తుందో 
 కాటికి సాగనంపేస్తుందో 
 కలలే కల్లలు చేసేస్తుందో  "వస్తుంది"
 ఆగిన మగ్గాలను నడిపిస్తుందా వారి అర్ధనాథాలను ఆపేస్తుందా 
 సహకారం వారి కందిస్తుందా లేక సర్దుకుని జారిపోయె స్తుందో 
 అవినీతి ఆగడాలను ఆపేస్తుందా 
 అసమానతల తొలగిస్తుంతుందా 
 ఆదరణను చూపిస్తుందా లేక 
 అంధకారంలోకినెట్టేస్తుందో "వస్తుంది "
 చెడును చెరసాలకు చేర్చేసి 
 అన్యాయాన్ని నిలదీసి 
 న్యాయం మనకందిస్తుందా...లేక 
మననే చెంపచెల్లుమనిపిస్తుందో..
 దగాకోరు దందాలాపేసి 
 దోచుకున్న డబ్బు పంచబడుతుందా 
 భారతదేశ రుణం తీర్చబడుతుందా 
 దారిద్ర్యo తొలగించబడుతుందా 
"వస్తుంది "
 ఆక్రమించిన ఆస్తులు లాక్కొని 
 అక్రమాలన్నీ అరికట్టి 
 అణగారిన వర్గాలకు పoచేస్తుందా
 లేక అపహాసం చేసేస్తుందో.---
 కలుషిత రాజకీయాల ఆపించేసి 
 ప్రజల కష్టాలన్నీ తీర్చేసి 
 కడవరకు మమ్మాదుకుంటుందో 
 ఇక కాలగర్భంలో కలిపేస్తుందో ---
 నిరక్షరాస్యత నిర్మూలించి అక్షరాస్యులుగా  మార్చేసి   
మూఢనమ్మకాలను నిర్మూలించే         
 జ్ఞానవంతులుగా మార్చేస్తుందో లేక 
నడినిశిలోకి నెట్టేస్తుందో  "వస్తుంది "                  
అనంత పన్నులనరికట్టి                   
అధిక ధరలను అణచేస్తుందా 
 వసూలు ఎక్కువ పంచుడు తక్కువ నాపేస్తుందా లేక  మననే పాతళానికి పడవేస్తుందో "వస్తుంది "
  ప్రభుత్వ సంస్థలనన్నింటిoని 
 ప్రైవేటుపరం చేయుటనాపించేసి 
 కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందా   లేక 
మనల పెద్ద కలుగులోకి తోసేస్తుందో "వస్తుంది "                                      
అసత్యాన్ని సత్యంగా మార్చేసె 
 తప్పుడు తీర్పులనిప్పించేసి 
ఆ తీర్పు చెప్పినవారిని అందలమెక్కించేసె 
 ఆగాడాలనాపెచేస్తుందా 
లేకాతీరునే కొనసాగిస్తుందో."వస్తుంది "             
కులం పేరుతో మతం పేరుతో 
మానవత్వాన్ని మంటగలిపే 
మూర్ఖత్వాన్ని మూలకు నెట్టేస్తుందో    లేక   
మూలవాసులనసలే లేకుండా లేపేస్తుందో.. "వస్తుంది "
 కపట మోసాలు కట్టేసి   కల్మషాలను తొలగించే 
 కాగడలా వెలుగునిస్తుందా 
 దాన్ని ఎల్లకాలం  కొనసాగిస్తుందో 
లేక  మనల కాలగర్భములో కలిపేస్తుందో.........................       
  .ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో.....
 ఎన్నెన్నో అర్ధనాథాలు ఆక్రందనలు 
 అల్లరి మూకల చిల్లర చేష్టలు నియంతృత్వపు పోకడలు 
 రాబందులాంటి రెక్కల చప్పుడు 
 ఆపేస్తుందో కొనసాగిస్తుందో 
 వేచి చూద్దాం ఈ సంవత్సరం -"వస్తుంది
                

కామెంట్‌లు