సామాజిక సేవకుడు, రచయిత, సంఘసంస్కర్త, బడుగు వర్గాల బాంధవుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, పీడిత వర్గాల పితామహుడు, పూణేలో కున్భీ కులంలో పుట్టి పూల వ్యాపారమే వృత్తిగా భావించిన గోవిందరావు గారి కుమారుడు జ్యోతిబాపూలే. అతని సహచరి సావిత్రి బాయి. వీరిద్దరికీ, (పూలె కు 13 సంవత్సరాలు, ఆమెకు 9 సంవత్సరాలు) బాల్య వివాహం జరిగింది. సావిత్రిబాయి గారు ఎప్పుడు భర్తని సేట్ జీ అని గౌరవం గా పిలుచుకునేది. ఆమె కోసం పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు సావిత్రిబాయి గారు వాళ్ళ అమ్మానాన్నతో నాలాగా అతను చెట్లెక్కుతాడు చింతకాయలు తెంపుతాడా, ఆరుబైట మంచంలో పడుకుని ఆకాశంలో చుక్కలు లెక్క పెడతాడా అని అడిగింది. అలాంటి అమ్మాయి తర్వాత సామాజిక సేవకురాలుగా సంఘసంస్కర్తగా విప్లవ కారణిగా ఉపాధ్యాయురాలుగా ఎదిగింది. అలాంటి మహనీయురాలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇలాంటి వారు ఈ రోజుల్లో దొరకడం చాలా అరుదు. సావిత్రిబాయి గారు జనవరి 3న నైగావ్ అనే పల్లెటూరులో జన్మించడం జరిగింది ఆమె పక్క పల్లెటూరు వాతావరణoలో పెరిగిన అమ్మాయి, పల్లెటూరు అనుభవాలను మనసారా అనుభూతి పొందినటువంటి స్త్రీ. ఆమె వివాహం చేసుకున్నప్పుడు ఆనాటి సమాజంలో జరిగినవన్ని బాల్యవివాహాలే. ఇంకా సమాజంలో సతీసహగమనం, కింది కులాల వారు చదువుకోవద్దు, మంచి భోజనం చేయవద్దు వెండి బంగారం లాంటి నగలు ధరించవద్దు, మంచి బట్ట కట్టుకోవద్దు, అతి శూద్రు వర్గాల వారు ఉన్నత వర్గాల ఎదురైతే పక్కకు తొలగి వెళ్లాలి, వారి అడుగులు భూమి మీద పడొద్దు, వారి ఉమ్మి నేల మీద పడవద్దు, వీరి అడుగులలో పెద్దకులాల వారు తొక్క వద్దని, తొక్కితే అది పాపంగా భావించేవారు.కనీసము కింది వర్గాల యొక్క నీడ కూడా భూమి మీద పడకుండా ఉండడానికి పెద్ద కులాల వారు ఎదురు రాగానే అతిశూద్రులు భూమి మీద సమాంతరంగా పడుకోవాలి. అతిశూద్రుల ఉమ్మి భూమి మీద పడకుండా ఉండడానికి మూతికి ముంత, వాళ్ళు నడిచిన అడుగులు కనపడకుండా డానికి మొలకు తాటి ఆకులు కట్టించేవారు.ఇలాంటి అనేక దురాచారాలను ప్రజలను ఆచరింప చేసేవారు. ఇంత హీనమైన దుర్భర పరిస్థితులున్న కాలంలో పుట్టినప్పటికిని భర్త ప్రోత్సాహంతో చదువుకున్నది. అయితే ఈమె చదువుకునే టప్పుడు చూసిన వాళ్ళ మామగారు గోవిందరావు పూలే గారిని నువ్వు చదువుకోవడమే ఎక్కువ, అడది చదివితే చెడిపోతుంది చెప్పినట్టు మాట వినదు అని అనేవాడు కానీ పూలే గారు ఇదంతా తప్పని సావిత్రిని చదివించి నిరూపిస్తానన్నాడు. అంతకుముందే జ్యోతిబాపూలే గారు సమాజ సేవ కోసం సత్య శోధక సమాజాన్ని స్థాపించి. ఆ సమాజం నుంచి అతను అనేక కార్యక్రమాలు చేపట్టేవాడు. ఆనాటి సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి పూలె గారు ఎనలేని సేవ చేశారు వారి కండదండగా సావిత్రిబాయి పూలే గారు ఉండేవారు. ఆనాటి సమాజంలో ఉన్నటువంటి కింది వర్గాలు మొత్తం దుర్భరంగా ఉండడానికి చదువు లేకపోవడమే కారణమని తెలుసుకొని, వారికోసం ముందుగా అన్ని వర్గాల బాలికలకు స్త్రీల కు చదువు నేర్పడం కోసం కొందరు మిత్రులు సహకారంతో పూలె గారు పాఠశాలలు ఏర్పాటు చేశారు. వారికి ఆర్థికంగా సహకరించిన వారిలో ఆనాటి అభ్యుదయవాదులైన బ్రాహ్మణ మిత్రులు కూడా ఉన్నారు. పూలె గారు ఎప్పుడు బ్రాహ్మణ కులాన్ని కాకుండా బ్రాహ్మణ వాదాన్ని వ్యతిరేకించేవాడు, ఇప్పటికి మన సమాజంలో అన్ని కులాల్లో కూడా కొందరిలో బ్రాహ్మణవాదం నిలిచి ఉన్నది. అయితే ఈ పాఠశాలలో బోధించడానికి వచ్చినటువంటి ఇద్దరి ఉపాధ్యాయులను ఆనాటి బ్రహ్మణులు భోధన చేయకుండా అడ్డుపడినారు. తర్వాత ఒక ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు వస్తే ఆమెను కూడా బోధించకుండా చేసి వెనుకకు పంపడం జరిగింది. అప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇంటికి వచ్చినటువంటి పూలే గారు ముభావంగా ఉన్నాడు అతని చూసినటువంటి సావిత్రిబాయి పూలే ఏమిటి ఏమైంది ఈరోజు ఇలా ఉన్నావు అని అడిగింది. ఏమీ లేదు అని నీరసంగా మాట్లాడాడు. మరలా సావిత్రిబాయి పూలే అతన్ని అడగడం జరిగింది. అప్పుడు అతను ముందు జరిగిన విషయం అంత వివరించడం జరిగింది. ఏం చేయాలో నిద్ర ఆలోచనలో పడ్డారు. అప్పుడు పూలె గారికి ఒక ఆలోచన వచ్చింది. సావిత్రి ఈరోజు నుంచి నువ్వు చదువు నేర్చుకోవాలి అని అనగానే ఆమె ఆశ్చర్యపోయి నేను ఎందుకు చదివు నేర్చుకోవాలి, నాకెందుకు అవసరం అని అన్నది. శస్త్రీ విద్య అనేది ముందుగా నా ఇంట్లో నుంచి మొదలవ్వాలని ముందుగా తన భార్యకు చదువు నేర్పడానికి పూనుకున్నాడు. (తండ్రి ఎదిరించిన ) అప్పుడు సావిత్రిబాయి పూలే చరిత్ర భూగోళం అర్థశాస్త్రం మొత్తం విషయాలను నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతిరోజు పాఠశాలకు బోధించడానికి వెళ్ళేది వస్తూ పోతూ ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆమె ఫై పెండ బురుద నీళ్లు చలేవారు, రాళ్లు విసిరేవారు, అయినా ఏమాత్రం మనోధైర్యం చెడకుండా ఆమె ప్రతిరోజు తాను వేసుకున్న దుస్తులతో పాటు ఒక జతను ఎక్కువగా తీసుకెళ్లి పాఠశాలకు వెళ్లగానే పెండ బురద పడినటువంటి ఆ దుస్తులను మార్చుకునేది. వర్గాల పిల్లలకు విద్యను నేర్పించింది. తర్వాత సావిత్రిబాయి గారు అనేక రచనలు చేసింది.
ఆమె ఆనాడు భర్తతో పాటు కలిసే అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సేవ చేసేది. ఒకసారి పూణేలో ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు కింది తరగతుల వారికి సేవ చేయడానికి ఎవరు రాకపోయేసరికి. భర్త స్వయంగా వైద్యం నేర్చుకుని వాళ్లకు సేవలు అందిస్తుంటే భర్త తోపాటు ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ ఉండేది. ఒకరోజు సేవ చేస్తున్న సమయంలో ఒక గుడిసెలో ఒక పిల్లవాడు కడుపునొప్పితోమెలికలు తిరుగుతూ ఉన్నాడు అప్పుడు ఆ విషయాన్ని సావిత్రిబాయి గారు చూసి పిల్ల వాన్ని ఎత్తుకొని ఈ పిల్లవాడు ఎటువంటి వైద్యం లేకుండా ఇలా చనిపోవాల్సిందేనా అని ఆలోచించి అతన్ని ఒళ్లోకి తీసుకుని ఎత్తుకుంది అతనికి వైద్యం చేసి ప్రాణం పోసింది. ఆనాడు అంత దుర్భరమైనటువంటి సమాజంలో కూడా ఎంతో ధైర్యంతో ప్రజలకు సేవ చేసిందంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకొనకుండా మనం ఉండలేం. ఇలా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు కింది వర్గాలకు సేవ చేస్తున్న సమయంలో మిగతా పై కులాల వారు అంతా వారిని వ్యతిరేకించేవారు, అడ్డు పడ్డారు. అయినా కానీ వీరు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. వీరిద్దరికీ పిల్లలు లేరు. భార్యా భర్తలిద్దరు కలిసి సమాజసేవ చేయడానికి పిల్లలు ఉంటే సేవ చేయలేని ఏమో అని పిల్లలు వద్దనుకోవడం జరిగింది. కానీ వారిద్దరూ కలిసి ఒక బాల బ్రాహ్మణ వితంతువుకు పుట్టినటువంటి బిడ్డను తల్లి చనిపోగానే వీరు ఆ బాలున్ని ఎవరి దగ్గరికి తీయకపోయేసరికి వీరిద్దరూ దత్తత తీసుకున్నారు. సావిత్రిబాయి పూలే గారు కూడా భర్తలాగే ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత శోధక సమాజం ద్వారాసమాజ సేవ చేయడానికి యశ్వంత్ అనే దత్తపుత్రుడు బాధ్యత తీసుకోవడం జరిగింది. ఆనాడు కాదు ఈనాడు ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ విధంగా సమాజానికి సేవ చేసే వారిని మనం ఎంత మందిని చూడవచ్చు, ఇలాంటివారు చాలా తక్కువ మంది ఉంటారు.
ఇప్పటికైనా మనం ఇలాంటి మహనీయుల ఒక జీవిత చరిత్రను చదివి వారి ఆదర్శాలను అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలో ఉన్న ప్రజలకు సేవ చేయాలని అందరం కోరుకుందాం. వారిద్దరిది సేవనే కాదు వారిద్దరిది గొప్ప త్యాగం అని కూడా చెప్పవచ్చు. ఈనాడు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు సావిత్రిబాయి పూలేను మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తించి, ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని కి అభినందనలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి