మేము నిన్ను కని, పెంచి పెద్దగా చేశాం. నీకు చదువు కోసం ఎన్నో అప్పులు చేశాం. కష్టాలను ఎదిరించి బయటకు వచ్చాం. నిన్ను చదివించినందుకు నువ్వు ఉద్యోగం తెచ్చుకొని మా కష్టాన్ని వృధా కాకుండా చేశావు. నీకు పెళ్లి చేసిన తర్వాత నువ్వు వేరే ప్రదేశానికి వెళ్తానని అన్నప్పుడు సరే అని అన్నాం. కానీ ఇప్పుడు మేము మీకు గుర్తుకు ఉన్నామో లేదో. నెలకు ఒక్కసారైనా చూడడానికి రావు. కనీసం ఫోన్ కూడా చేయవు. అదే మేం ఫోన్ చేస్తే పనిలో ఉన్నాను, తర్వాత చేస్తాను అని అంటావు. మళ్ళీ తర్వాతా చేయవు. మాలాంటి వారు వయసు వచ్చి చనిపోతామేమో అనే బాధ లేదు. కానీ మిమ్మల్ని చూడకుండా చనిపోతామేమో అనే బాధతోటే చనిపోతూనే ఉన్నాం . ఇప్పుడైనా మా బాధ తెలుసుకోండి. మమ్మల్ని చూడడానికి నెలకు ఒకసారైనా రండి. అసలు మేము గుర్తున్నామా.... ? మేము.. మీ అమ్మానాన్నలం! ?!అది మాత్రం మరిచిపోకండి సుమా!
చివరి చూపు.. చూడడానికైనా.. వస్తారా .. ?!
చివరి చూపు.. చూడడానికైనా.. వస్తారా .. ?!
Poyekalam
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి