ప్రముఖ కథా రచయిత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కృతులు మేరెడ్డి యాదగిరిరెడ్డి రచించిన పిట్టగూళ్ళు బాలల కథల సంపుటి ఆవిష్కరణ వినూత్నంగా జరిగింది. నకిరేకల్ మండలం తాటికల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులే సభాధ్యక్షులుగా, విద్యార్థులే వక్తలుగా సమీక్షకులుగా వ్యవహరిస్తూ విద్యార్థులు ఈ పుస్తకం ఆవిష్కరించడం విశేషం. శనివారం తాటికల్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థిని నందిని అధ్యక్షతన జరిగిన బాలసభలో 9వ తరగతి విద్యార్థిని గాదగోని పూజిత పిట్టగూళ్ళు పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఏడవ తరగతి విద్యార్థి పుట్టం నీల్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సభలో ఆకిటి ఆశ్రిత, కాడింగు ఇందు, మేడ హిమ వర్షిని, మన్నెంభాను, పొల్లెగొని నాగసాయి, శిరసన వాడ శివకుమార్, మన్నెం జయంత్, ముచ్చపోతుల నరేందర్, భరత్ చంద్ర ఆజాద్ తదితర 13 మంది వక్తలు పుస్తకాన్ని అనేక కోణాల నుంచి సమీక్షిస్తూ మాట్లాడారు. బాలసభ అనంతరం పుస్తక రచయిత మేరెడ్డి యాదగిరి రెడ్డి తమ స్పందన తెలియజేస్తూ చిన్న వయసులో పిల్లలు గొప్ప విమర్శ చేశారని కొనియాడారు. ఇటువంటి సభల వల్ల పిల్లలను సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ప్రజ్ఞాపురం వెంకన్న మాట్లాడుతూ పిల్లల పుస్తక సభను పిల్లల మధ్య చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పండుగ తిరుమలయ్య, మోసంగి హరీష్ చంద్ర, మార్త రాములు, డాక్టర్ సాగర్ల సత్తయ్య, నర్రా వెంకటరెడ్డి, లొట్లపల్లి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
వినూత్నంగా పిట్టగూళ్ళు ఆవిష్కరణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి