అమ్మ ఉంది!!!:- డా ప్రతాప్ కౌటిళ్యా
తాజ్ మహల్ నీడల్లో 
ఏముంది!!?
చైనా గోడల్లో 
ఏముంది!!?
ఈఫిల్ టవర్ లో 
ఏముంది!!?
మమ్మీల కట్టడాల్లో 
ఏముంది!!?

అమ్మ ఉంది!!!

ఆకాశపు రంగుల్లో 
ఏముంది!!?
సముద్రపు రంగుల్లో 
ఏముంది!!?
అడవి రంగుల్లో 
ఏముంది!!?

అమ్మ ఉంది!!!!

పారే నదుల్లో ఏముంది!!?
ఎత్తయిన జలపాతాల్లో ఏముంది!!?
లోతైన బావుల్లో ఏముంది!!?

అమ్మ ఉంది!!

శూన్యంలో ఏముంది!!?
నక్షత్రాల్లో ఏముంది!!?
గ్రహాల్లో ఏముంది!!!!!?
భూ గృహాల్లో ఏముంది!!?

అమ్మ ఉంది!!!

ఎడారిలో ఏముంది !!?
తడారిన నేలల్లో ఏముంది!!?
బీడు వారిన పొలాల్లో ఏముంది!?
ఎత్తయిన పర్వతాల్లో ఏముంది!!?

అమ్మలేని జాడ ఉంది!!!?

**** ‌**** ‌**"†**
డా ప్రతాప్ కౌటిళ్యా 👏 8309529273
**†***********

కామెంట్‌లు