దేశానికి సైన్యం- బలం!
ఉపాధ్యాయినికి విద్యార్థులే సైన్యం!!
ఉపాధ్యాయినికి విద్యార్థులే బలం!
ఉపాధ్యాయినికి విద్యార్థులే ధనం!!
ఉపాధ్యాయినికి విద్యార్థులే విజ్ఞానం!
ఉపాధ్యాయినికి విద్యార్థులే ప్రపంచం!!
మొక్క ఎదగాలంటే
భూమి కావాలి నీరు కావాలి!!
ఎరువు కావాలి ఎండా కావాలి!!
కానీ బుద్ధి ఎదగాలంటే
బుద్ధుడు కావాలంటే- గురువు కావాలంటే.!?
ఉపాధ్యాయిని కావాలంటే
ఇది ఏదీ అవసరం లేదు
విద్యార్థినిగా ఉంటే చాలు!!!
సూర్యుడు మొక్కకు గురువు !
చంద్రుడు సముద్రానికి గురువు !!
ఉపాధ్యాయిని సంఘానికి గురువు!!
ఉపాధ్యాయిని సంఘానికి సహాయం చేస్తుంది
సహకరిస్తుంది బోధిస్తుంది!!?
మనుషులను విడదీసేవి
విప్లవాలు ఉద్యమాలు
మనుషులను కలిపే వాళ్లు
ఉపాధ్యాయినీలు!!!?
మనుషులను కలిపేది విద్య!!
నరకాన్ని నాశనం చేసి
నాగరికతను నవ సమాజాన్ని
నిర్మించే వాళ్లు- ఉపాధ్యాయినిలు!!
వారిని పూజిద్దాం వారిని గౌరవిద్దాం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి