నాన్న ప్రేమ :- పుప్పాల జ్యోతి -ఏడవ తరగతి ఇ/మీ.-ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల - -గోషామహల్, అంబర్పేట్,హైదరాబాద్.

 నాన్న అన్న ఒక్క పదం ఎంతో ప్రేమ, ధైర్యాన్ని ఇస్తుంది. 
అమ్మ కడుపులో ఉన్నప్పుడి నుండి మనను ప్రేమించే వ్యక్తి నాన్న
అమ్మ అని ఎవరిని పిలిచినా పలుకుతారు -
కానీ నాన్న అని మరొకరిని పిలవలేము.
ఆ నాన్న ప్రేమ మరొకరి దగ్గర దొరకదు. 
అమ్మ తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంది -
 నాన్న తన జీవితాంతం గుండెల్లో మోస్తాడు. 
మనం ఏ పని చేసిన చేయకున్నా -
తనకు ఎన్ని కష్టాలు ఉన్నా మనకు మాత్రం చిన్న కష్టం కూడా  రాకుండా ప్రతి నిమిషం మన వెనకాల ఉండే నడిపిస్తాడు. 
ప్రతి ఒక్క నాన్న తన అమ్మాయిలో వాళ్ళ అమ్మను చూసుకుంటాడు -
 మా అమ్మ నా దగ్గరికి మళ్లీ వచ్చిందని మురిసిపోతాడు. 
నాన్న దగ్గర ఉన్నప్పుడు కలిగే భద్రత మరెవరి దగ్గర ఉన్నా కలుగదు.
మనకు ఏ చిన్న గాయమైన తట్టుకోలేడు నాన్న .
భార్య బిర్యానీ చేస్తే వంకలు పెట్టే నాన్న - తన కూతురు మ్యాగీ చేస్తే పెద్ద వంట చేసినట్లు మురిసిపోతాడు.
నాన్న తాను ఎలా ఉన్నా - మనను మాత్రం మహారాణిలా చూసుకుంటాడు. 
కూతురు కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ 
తన కూతురు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతుంటాడు.
అందుకే 
నాన్న ఏం సంపాదించిన సంపాదించకపోయినా తన కూతురికి మాత్రం ఎప్పటికీ రాజే ! దేవుడే!
        

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
👍