జనం గుండె గొంతుకలైన 100 మంది అక్షర యోధులకు పురస్కారాలు


  విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో ఈనెల 12న ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ప్రదానోత్సవం 
2024 లో 45 మంది, 2025 లో 45 మంది ఎంపిక, మహిళా జర్నలిస్టులకు ప్రత్యేకంగా 10.
ఈ ఏడాది 25 విభాగాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఒక్కో ఉమ్మడి జిల్లా నుండి ఒకరిని ఎంపిక చేశాం
 గ్రహీతలకు రూ. 5వేలు నగదుతో కూడిన పురస్కారం, ప్రశంసాపత్రం, రూ.20 లక్షల ప్రమాద బీమా 
ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు మరియు  అత్యున్నత తెలుగు ప్రముఖులు, ఆత్మీయులు
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు వెల్లడి
 విజయవాడ : 
అక్షరాస్త్రాలతో సమాజాన్ని చైతన్య పరిచే బృహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు ' ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు' అందించి, గౌరవించాలని 'తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నిర్ణయించిందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుండి 100 మంది ఉత్తమ జర్నలిస్టులకు ఈ నెల 12 తారీఖున విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పురస్కారాలు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ ముఖ్య అతిథిగా హాజరై తన స్వహస్తాలతో పురస్కారాలు అందజేయనున్నట్లు మేడవరపు రంగనాయకులు తెలిపారు. విశిష్ట అతిథిగా రాష్ట్ర మంత్రి, ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు వివరించారు. 2024 లో 45 మంది, 2025 లో 45 మంది, మహిళా జర్నలిస్టులకు ప్రత్యేకంగా 10 పురస్కారాలు అందిస్తున్నామన్నారు. గత ఏడాదికి సంబంధించి ఉత్తమ జర్నలిస్టులను గతంలోనే ప్రకటించామని, ఈ ఏడాది 25 విభాగాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఒక్కో ఉమ్మడి జిల్లా నుండి ఒకరిని ప్రతిభ, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేశాం అన్నారు. ఎంపిక కాబడ్డ వారికి రూ. 5వేలు నగదుతో కూడిన పురస్కారం, ప్రశంసాపత్రం, రూ.20 లక్షల ప్రమాద బీమా అందజేయనున్నట్లు వెల్లడించారు. అక్షరాన్నే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వారికి ఇటువంటి ప్రోత్సాహం ఎంతగానో ఉత్తేజాన్నిస్తుందని, వృత్తి పట్ల మరింత నిబద్ధతను, అంకిత భావాన్ని పాదుకొల్పడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నామన్నారు. జర్నలిస్టు సంఘాలంటే పోరాటాలకు, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యే మూస ధోరణికి పరిమితం కాకుండా జర్నలిస్టులను వృత్తిపరంగా ప్రోత్సాహించే వినూత్న కార్యక్రమానికి తమ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం శ్రీకారం చుట్టడం సంతోషదాయకం అన్నారు. పురస్కారాలు అందుకున్న వారిలో అన్ని రకాల పత్రికల్లో, మీడియాలో పనిచేస్తున్న వారు, పలు జర్నలిస్టు సంఘాలకు చెందిన వారు ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. జర్నలిస్టు ప్రతిభే ప్రామాణికంగా, అత్యంత పారదర్శకంగా పురస్కార గ్రహీతలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విశేష ఆదరణ పొందుతున్న తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యులు, రాష్ట్ర, జిల్లా నాయకులు భారీగా తరలిరావాలని ఈ కార్యక్రమం విజయవంతంలో పాలుపంచుకోవాలని కోరారు. జర్నలిస్టులను గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమేనని, కావున జర్నలిస్టు సంఘాలకు, ప్రాంతాలకు, పత్రికలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేడవరపు రంగనాయకులు విజ్ఞప్తి చేశారు.



కామెంట్‌లు