అనగనగా రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రవి, చందు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు రవికి అమ్మ నాన్న ఉన్నారు ,కానీ చందుకి అమ్మ నాన్న లేరు. రవిని వాళ్ళ అమ్మ నాన్నలు మంచిగా చూసుకునేవాళ్ళు.చందుని వాళ్ళ చిన్నాన్న చూసుకునేవాడు. రవి, చందు కలిసి బడికి పోతారు. 7వ తరగతి చదువుతున్నారు. రవి మంచిగా చదివేవాడు కాదు.చందు మంచిగా చదువుతాడు ఒక రోజు వాళ్ళ తెలుగు టీచర్ వచ్చి ఈ రోజు ఎనిమిదవ పాఠము "క్రీడలు వినోదాలు" చెప్పుకుందాం అంటారు. పాఠం చెప్పే కన్న ముందు మీ ఇద్దరికి ఒక ఆట పెడుతాను. ఆ ఆట పేరు" మంచి దారి- చెడుదారి" అని అంటాడు. ముందుగ వాళ్ళను ప్రక్కన ఉన్న అడవికి తీసుకుపోతాడు. అక్కడ ఒక దారి ఉంటుంది. టీచర్ ఆ దారి గుండా వెళ్ళమని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి ఆ దారి గుండా వెళ్ళారు. వాళ్ళు అడవి మధ్యలోకివెళ్తారు. అక్కడ రెండు దారులు ఉంటాయి. ఒకటో దారి మంచి దారి అంటే మళ్ళీ వాళ్ళ టీచర్ దగ్గరకు వస్తారు. రెండవ దారి చాలా దట్టమైన అడవి మరియు పెద్ద, పెద్ద జంతువులు ఉంటాయి .ఇంకా ఆ దారిలో తికమకగా ఉంటాయి. చాలా కష్టాలు ఎదురుకోవాల్సి వస్తుంది అని ఒక బోర్డుపైన ఉంటుంది. చందు మంచి దారి వైపు వెళ్ళాలని అనుకుంటాడు .ఎందుకంటే చందుకి చదువు వచ్చు కాబట్టి.రవి రెండో దారివైప్పు వెళ్ళాలని అనుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఒక పులి బొమ్మ ఉంటుంది. దాన్ని చూద్దాం అని రవి వెళ్ళాలని అనుకుటాడు. చందు వాడి దారిన వాడు పోకుండా రవిని గమనిస్తాడు. రవి రెండో దారి వైపు వెళ్తున్నాడని అనుకొని రవిని ఆపడానికి పోతాడు. కాని రవి వినకుండా చందు ఎంత బ్రతిమిలాడినా నేను ఆ దారి గుండానే వెళ్తాను అని చందుని గట్టిగా చెంపమీద కొడతాడు. అప్పుడు చందు ఏమి చెయ్యలేకకిందపడిపోతాడు. కాసేపటికి వర్షం వస్తుంది. చందు లేచి రవిని చూస్తే రవి అక్కడ ఉండడు .అప్పుడు చందు నిరాశతో ఒకటవ దారిలో వెళ్ళి తన టీచరుకు జరిగినదంతా చెబుతాడు టీచర నేను ఎవరికి ఎంత చదువు వస్తుందనే ఈ ఆట మీ ఇద్దరికీ పెట్టాను. ఈ ఆటలో నువ్వే గెలిచావు అని రవిని వెతికి జంతువుల బారి నుండి కాపాడుతారు.
నీతి : నీకు చదువు రాకపోతే చదువు వచ్చిన వాడి మాటైన వినాలి లేకపోతే ఎన్ని కప్పలు ఎదురుకోవాల్సి వస్తుందో ఈ కథ ద్వారా తెలుస్తుంది.
=========================================
కథా శిక్షణ&పర్యవేక్షకురాలు
Dr. దుగ్గి గాయత్రి,
పి.జి.టి.తెలుగు,
M.A.,B.ed,SET,PhD.
నీతి : నీకు చదువు రాకపోతే చదువు వచ్చిన వాడి మాటైన వినాలి లేకపోతే ఎన్ని కప్పలు ఎదురుకోవాల్సి వస్తుందో ఈ కథ ద్వారా తెలుస్తుంది.
=========================================
కథా శిక్షణ&పర్యవేక్షకురాలు
Dr. దుగ్గి గాయత్రి,
పి.జి.టి.తెలుగు,
M.A.,B.ed,SET,PhD.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి