సామూహిక వివాహాలకు శ్రీకారం...:- పోలయ్య కవి కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్-చరవాణి...9110784502
భద్రాచలం రామాలయం సాక్షిగా...
శ్రీరామ నవమి పర్వదినాన ప్రభుత్వం 
ఇచ్చు ప్రతి ఏడాదీ పట్టువస్త్రాల హారతి...
పూజారులు చేసేరు సీతమ్మకు ముత్యాల
 తలంబ్రాలతో మంగళధారణ మహోత్సవం

పెళ్ళంటే "నూరేళ్ళ పంట" కలవారికి...
పెళ్లి ఖర్చులు భరించలేని పేదవారికి...
పెళ్ళి ఒక కల అది తీరంచేరని ఆశలఅల

ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా... 
అధికారుల ఆర్థిక ప్రణాళికతో...
దయార్ద్ర హృదయుల...
దానకర్ణుల సహకారంతో... 
శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవంలో
సామూహిక వివాహాలకు శ్రీకారం చుడితే.
ఆ కొత్తజంటల జన్మధన్యమయ్యేను కదా
ఆ ఆదర్శదంపతుల అండతో ఆశీస్సులతో

అది పూజారులకు పుణ్యప్రాప్తి...
ధర్మదాతలకు దక్కును కీర్తి కిరీటం...
ఆదర్శ ప్రాయమైన అట్టి... 
ఆ "సీతారాముల కళ్యాణ వైభోగం" 
నిరుపేద కుటుంబాలకొక నిండుజాబిలి... 


కామెంట్‌లు