మహిళా నాటకం! మానవ జీవన దర్శనం!:- డా పివిఎల్ సుబ్బారావు. -విజయనగరం-\9441059797.
 1.
ముదమార నేర్పిన ముదితలు, నేర్వని విద్య గలదే! 
సాహిత్యాంతం,నాటకంధృవం, నిరూపిస్తున్నారు అతివలే! 
అద్భుతనటనతో పాత్రలలో, 
 జీవిస్తున్నారు ముదితలే!
ఆవేదిక నవరసనటనాభరితం, ప్రేక్షక సమ్మోహనము!
చూసే ప్రేక్షకగణం తలతిప్పక, లీనమైన అద్భుత దృశ్యం!
2.
ఆరు పాత్రలు ఒక పాత్రకి, గుణపాఠం చెబుతున్న వైనం! 
చట్టం ఆదుకోకపోతే స్త్రీలే,
ముందుంటారన్నది నిజం! 
సమాజంలో స్త్రీలపై, అత్యాచారాలు ఆగి తీరాలి! 
లేఠుంటే ఆడవాళ్లంతా ఒకటై, ప్రభంజనంలా సాగాలి!
స్త్రీల ఐకమత్యం నేరచరితుల, పాలిట వజ్రాయుధం! 
3.
ఆబలసబల,భామసత్యభామ,
వనిత వీరవనిత! 
స్త్రీ స్వయంగా శక్తిస్వరూపిణీ,
సహస్ర ఆయుధధారిణి!
పురుషుడు హద్దు మీరితే,
బుద్ధి చెబుతుంది మరి! 
పురుషాధిపత్యం స్త్రీ ఎదురు, తిరిగితే మట్టికలుస్తుంది సరి!
జగాన అర్ధనారీశ్వరతత్వం,  అసలైన స్త్రీపురుష సంబంధం!
4.
ఆధునిక కాలం మహిళల, హవా వీస్తున్న శుభతరుణం!
రంగమేదైనా మహిళలు,
సాధిస్తున్న ఆరోహణాక్రమం!
నటనలో సైతం స్త్రీ మహానటి,
 పురుషులతో నిత్యం పోటీ!
దీనికి సజీవ ఉదాహరణ,
ఈచిత్రం చూపే నాటకం!
సమాజ సంస్కరణ స్త్రీలకూ, సాధ్యం అంటున్నది ఈవేదిక,!
5.
తల్లిదండ్రులు ఆడపిల్లల్ని, కాలానికి తగ్గట్టు పెంచాలి! 
ఎన్నో అవకాశాలు ఉన్నాయి, అంది పుచ్చుకోమనాలి! 
స్త్రీ సహనం జీవితంలో, బలహీనత కాకూడదు! 
పురుషుడ్ని కని పెంచే స్త్రీ, కళ్ళెర్రచేసే పరిస్థితి రాకూడదు!
మహిళ తలెత్తితే మహి, తలవంచి వందనం చేస్తుంది! 
________


కామెంట్‌లు