కిష్టాపురం అడవిలో ఒక నక్క ఉండేది. ఆహారం కోసం పొద్దుగాల నిద్ర లేచింది. మంచి ఆహారం దొరకాలని తన మనసులో దేవుడ్ని
మొక్కుకుంది. ఆ వెంటనే వేటకు బయలుదేరింది. అలా బయలుదేరుతుండగానే ముళ్ళ పంది ఎదురయింది. "పొద్దు పొద్దుగాల దరిద్రపు పందిని చూశాను. ఏ అపశకునం వస్తదో? ఇవాళ ఏం జరుగుతుందో ఏమో? కనీసం ఆహారం దొరుకుతుందో లేదో ? అసలే మంచి రోజులు లేవు. ఏ వేటగాడి వలలో చిక్కుకుంటానో? ఈ దినమంతా కాస్త పైలం ఉండాలే " అనుకుంటూ ముందుకు సాగింది.
కొంచెం దూరం పోయినంక సచ్చిన గాడిద కనిపించింది. నక్క ఆనందానికి అవధులు లేవు. మస్తుగా సంబుర పడింది. ఆహా ఏమి అదృష్టం. తొందరగానే వారానికి సరిపడా విందు భోజనం దొరికింది అనుకుంటూ.. గాడిదను కడుపునిండా పీక్కుతినింది. అతి అయాసంగా రాత్రికి ఇంటికి చేరింది. ఇలా నాలుగు రోజులపాటు గాడిద మాంసంతో నక్క హాయిగా గడిపింది.
ఆ తర్వాత ఒక రోజున నక్క పొద్దుగాలనే నిద్రలేచింది. ఏ లోటు లేకుండా ఆహారం దొరకాలని దేవుణ్ణి ప్రార్థించింది. ఆహారం కోసం వెళ్తుండగా ఓ జింక ఎదురయింది. పూజకు పోయి వస్తున్న జింక నక్కకు ఫలహారం పెట్టింది. తిన్న తర్వాత "ఆహా ఏమి రుచి లే! ఈరోజు ఎంత సుదినం. శుభానికి సంకేతమైన జింక ఎదురయింది. పైగా దైవ దర్శనం చేసుకుని వస్తున్న సాధువు అది. దీంతో నా జన్మ కూడా ధన్యమైంది. ఈ రోజంతా సంతోషంగా ఉండవచ్చు. ఏ ఇబ్బంది రాదు. బోలెడంత ఆహారం దొరుకుతుంది" అనుకుంటూ సంతోషంగా ముందుకు నడిచింది.
రోజంతా వెతికినా నక్కకు ఎక్కడ కూడా గింతన్న ఆహారం దొరకలేదు. ఆకలితో డొక్క మాడింది. చాలా నీరస పడింది. అదే సమయంలో వేటగాడి వేట కుక్కల సప్పుడు వినిపించింది. ఏమి చేయాలో నక్కకు తోచలేదు. వణుకు పుట్టింది. వేట కుక్కలు పసిగట్టి వెంటపడ్డాయి. జిత్తులతో నక్క పరిగెత్తి గుబురు చెట్ల పొదల్లో దాచుకుంది. గమనించకుండా వేట కుక్కలు ముందుకు వెళ్లిపోయాయి. కాసేపయినంక బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చింది నక్క.
"అమ్మయ్యా! ఇయ్యాల బతికిపోయాను. లేచిన వేళ నా అదృష్టం జర బాగుంది. జింక ముఖం చూడబట్టే బతికి బయటపడ్డాను. లేకపోతే ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయేవి " అనుకుంటున్న సమయంలోనే పోయాయి అనుకున్న వేట కుక్కలు ఒక్కసారిగా మీదకు వచ్చాయి.. ఇదే తరుణంలో ఓ గున్న ఏనుగు కుక్కలను తరిమి నక్కను కాపాడింది. "ఈరోజు జింక ముఖం చూడబట్టే బతికిపోయాను. లేకుంటే పిల్లి ముఖమో, ముంగిస ముఖమో చూసి ఉంటే ఖతం అయ్యేదాన్ని " అని నక్క అనుకుంటూ ఆకలితోనే ఇంటికి వెళ్లిపోయింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి