సుందర కాశ్మీరం:- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
సుందర కాశ్మీరం
 అంటే
భూతల స్వర్గమే కాదూ రక్తప్రవాహమై
ఎగసిపడ్డ రుధిర జ్వాల 

కాశ్మీరం అంటే
ఇప్పుడు మంచుకొండలేకాదు
మానవత్వం మరచిన ముష్కరుల స్థావరం 

కాశ్మీరం అంటే 
నా దేశానికి మకుటాయమానం
ఇప్పుడు భయం గుప్పిట్లో...
అడుగడుగునా భీతావహం
పర్యాటకప్రాంతాల్లో పీనుగుల ఆనవాలు

కాశ్మీరం అంటే 
ఇప్పుడు పాక్ దురాత్మక మూకల
కవ్వింపు చర్యల
అగంతక ప్రదేశం



కామెంట్‌లు