సృష్టిలో అమృతం కంటె తీయని పిలుపు అమ్మ
తనకు కలిగిన సంతానం
గురించి ఎంతో పరితపించేను చూడు
పుట్టిన ప్రతీ బిడ్డ ప్రయోజకుడు అవ్వాలని ఆశీస్సులు అందిస్తుంది
ఏనాడు చెడు మాటలతో
బిడ్డలను దూశించదు
బిడ్డలను తనోద్ద కూర్చోబెట్టుకొని
కడు బోధ చేస్తుంది
తల్లి చేస్తున్న ప్రతి పనిలో
బిడ్డల మంచి గురించి ఆలోచిస్తుంది
ఎప్పుడు తను బాగుండాలని
తన సంతానం సంతోషంగా ఉండాలని
ఆ దేవ దేవున్ని కోరుకుంటుంది
బిడ్డలు చెడు తిరుగుళ్ళు తిరిగిన
తల్లి హృదయం తల్లడిస్తుంది
బిడ్డలు ప్రయోజకులైతే మాతృ
హృదయ కమలం సంబరపడి పోతుంది
పదిమందికి చెప్పుకుంటుంది
బిడ్డలు ప్రయోజకులవ్వక పోతే
పడరాని కష్టాలెన్నో పడి
కొంగుకు కట్టుకొని సాదుకొన్న
బిడ్డలెందుకిట్ల అయ్యారో అని ఆరాదిస్తుంది
పదిమందిల పోయిన పరువును
దక్కించుకోవాలని
బిడ్డలను దగ్గరకు తీసుకోని
మంచి మాటలతో ఎన్నో ప్రయత్నాలు
చేసి ప్రయోజకులను చేస్తుంది
తలెత్తుకొని పదిమందిలో గర్వంగా చెప్పుకొంటుంది
బిడ్డలు సమాజానికి ఉపయోగ పడే
పనులెన్నో చేస్తూ ఉంటే ఎంత
సంబరపడిపోతుందో
బిడ్డలకు ఆకస్మాత్తుగా ఏమైనా ఐన
తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది
చేతికందిన బిడ్డలు మరణించిన
మన మాతృ హృదయం
ఎంతో గాయపడి రోదిస్తుందో...
( స్వయంగా మా మాతృ హృదయం సంతోషం, రోధనను చూసి రాసిన కవిత )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి