మనందరికీ ఉండాలి చూపు
దేశాన్ని ముందంజలో ఉంచెందుకు ఉండాలి ముందుచూపు
విద్యార్ధికి విద్యార్థి దశ నుండె ఉండాలి చూపు
లక్ష్యాన్ని ఎంచుకొని సాధించడంలో ఉండాలి ముందుచూపు
తల్లిదండ్రుల పట్ల ఉండాలి చూపు
వృద్దాప్యమోచ్చినంక ఏ విధంగా చూసుకోవాలో ఉండాలి ముందుచూపు
క్రమశిక్షణలో ఉండాలి చూపు
క్రమశిక్షణారాహిత్యంలో చిక్కకుండా ఉండాలి ముందుచూపు
మానవత్వంను చూపించడంలో ఉండాలి చూపు
జాలి దయ కరుణ చూపించడంలో ఉండాలి ముందుచూపు
పేదరికంలో మ్రగ్గుతున్న వారికి ఉండాలి చూపు
పేదరికం రాకుండా పేదరికాన్ని నిర్ములన చేయడంలో ఉండాలి ముందుచూపు
నిరుద్యోగులకు ఉండాలి చూపు
నిరుద్యోగముకు కారణాలు వేదికి
నిరుద్యోగం రాకుండా ఉండాలి ముందుచూపు
ఆదాయ అసమానతలపై ఉండాలి చూపు
ఆదాయ అసమానతలు రాకుండా ఉండాలి ముందుచూపు
సంపదను సంపాదించడంలో ఉండాలి చూపు
సంపదను కాపాడుకోవడంలో ఉండాలి ముందుచూపు
అన్యాయాన్ని ఎదిరించడంలో ఉండాలి చూపు
ఎందుకన్యాయం జరుగుతుందో జరగకుండా ఉండాలి ముందుచూపు
స్నేహాన్ని ఎంచుకోవడంలో ఉండాలి చూపు
చెడు స్నేహాన్ని గుర్తించడంలో
ఉండాలి ముందుచూపు
తల్లిదండ్రులు మనల్ని గమనిస్తుంటారని ఉండాలి చూపు
మన చేష్టలు మనల్ని మన తల్లిదండ్రులు తిట్టకుండా ఉండంలో ఉండాలి ముందుచూపు
శత్రుమూకలను గమనిస్తూ ఉండడంలో ఉండాలి చూపు
శత్రుమూకలు రాజ్యంలోకి ఎందుకు చోరబడుతున్నారో
చోరబడకుండా ఉండాలి ముందుచూపు
మనందరికీ ఉండాలి చూపు
దేశాన్ని ముందంజలో ఉంచెందుకు ఉండాలి ముందుచూపు
( మనందరికీ చూపు, ముందుచూపు ( దూరదృష్టి )ఉండాలనే ఉద్దేశంతో రాసిన కవిత )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి