చెట్టుకు వేలాడుతున్న దృశ్యాలు :- భైరగోని రామచంద్రము -స్కూల్ అసిస్టెంట్, తెలుగు -హైదరాబాద్,-చరవాణి :9848518597.
దేశానికి వెన్నెముక రైతన్న 
ఆ రైతుకు అండదండగా ఎవరు లేరన్న  
బుక్కెడు బువ్వ తినుకుంటూ 
బుక్క బుక్క నీళ్ళు త్రాగుకుంటూ 
ఎండనక వాననక చలికి వణుకుకుంటూ 
ఆరుగాలం కష్టించి 
మనకు బుక్కెడు బువ్వను 
ఇచ్చేది మన రైతన్న 

విత్తనమేసినప్పటి నుండి 
మొలకెత్తి పెద్దయి పంట 
పండే వరకు అప్పు సప్పు తెచ్చి ఎరువులకే పెట్టి 
లాభమాసించక సాగు చేసెను రైతన్న 
ఆసామి దగ్గర అప్పు తెచ్చి 
పెట్టుబడికి పెట్టె 
పండిన పంట ఆసామికే అప్పజేప్పె
తన బిడ్డలకే తిండి లేకుండా చేసుకునే 
చివరకు అప్పు తీర్చలేక
పురుగుల మందే పెరుగన్నంగా చేసుకునే 
చెట్టుకు ఉరి పోసుకునే 

శరీరానికే రక్షణ ఇచ్చిన
చేనేత సాలన్నకు రక్షనె కరువైయ్యే 
ఆధునికయంత్రాల దాడికి తట్టుకోక చేనేత మగ్గాలు ఇరిగి పాయె 
సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చుకొనే 
నేడు చెట్లకు వేలాడుతున్న దృశ్యాలు ( శవాలు ) కనిపిస్తుండే 

సంసారమెల్లదీయక తండ్రులు 
అప్పులు చేసి తీర్చక
చావే శరణ్యమని చెట్టుకు ఉరేసుకుంటున్నరు 
యువతియువకులు నిరుద్యోగంతో తట్టుకోలేక 
ఇంట్లో బాధలతో ఏగలేక
ఉరితో ప్రాణం తీసుకొంటున్నరు 
రోజు రోజుకు ఇలా 
చెట్టుకు వేలాడుతున్న దృశ్యాలు 
వేలకోలది కనిపిస్తున్నవి.

కామెంట్‌లు