అమ్మప్రేమ:-డా.సి వసుంధర చెన్నై
అ  అంటే అమృతం మ్మ అంటే మమత  మాధుర్యాలు. అమ్మ అని  పిలవని నోరు   నీటి చుక్క లేని సెల ఏరు 

కడుపులో పెట్టుకొని మోస్తుంది 
నిన్ను ఒడిలో పెట్టుకొని  
లాలిస్తుంది. ఎద పైన 
మోస్తుంది.  చూస్తుంది నిన్ను వేయి విధాలుగా

*నవ్వరా నాతండ్రి!
తన వైపు చూచి.ఆగరా ఎదుగుటకు
తొందరెందుకురా! 

నీ తల్లి ప్రేమలో  తలమునకలైతుంటే  ఆ ఆనందమే నీకు శ్రీరామరక్ష. 

లాలపోసేనయ్య జోలపాడేను. పాలు వెన్నలన్నీ తెచ్చి పెట్టేను.
 
అమ్మ ప్రేమ అంటే అతి మధురమయ్య. 
అమ్మలేని బ్రతుకు అతి దుర్భరమ్ము

 అమ్మ ఎట్లా పెట్టు? కడుపు నిండా పెట్టు, కొసరి కొసరి పెట్టు 
కమ్మగా పెట్టు.

  పలురుచుల చూపించు
బలమైన పండ్లు 
అమ్మ తా తినకుండా
 నీకు  రుచి చూపించు 

పిల్లలకు వలదయ్య వేరే దైవమ్ము
పిలిచితే పలికేటి,       అమ్మే కదా అసలైన దైవం. ఆమె కదా నీపాలిధనము. 

 ఎవ్వరూ లేకున్నా ఎట్టి చింత లేదు, అమ్మ ఉంటే చాలు 
అది మీలు నీకు.అమ్మ మాట వినము, 
ఆమె కష్టము కనుము ఆమె ప్రేమను పొందు అదృష్టవంతుడవు 
ఎల్లప్పుడూ  అందివ్వు నీ ప్రేమ. 
ఆ తల్లి  మురియు
 తల్లి బిడ్డల బంధమే ధరణిలో అద్భుతము.

కామెంట్‌లు