సౌష్టవం!!!:- డా ప్రతాప్ కౌటిళ్యా
నీటి ఆభరణాలు ధరించిన ధరిత్రి 
ఆకు పచ్చని పచ్చ లతో కెంపులతో 
మాల లల్లి మెళ్ళో వేసుకున్నది.!!

కాళ్లకు వాగుల వంపుల కడియాలు తొడిగి 
నడుముకు నదుల నగిసిల వడ్డాణము పెట్టి 

ముక్కుకు నీటి చుక్క ముక్కెరతో ముల్లోకాలనేలే కాళీ లా ఉంది!!!

ఎర్రబడ్డ కళ్ళల్లో ఎడారి తుఫాను లేన్నో

నుదుట దిద్దిన తీర్థ తిలకం రక్తసిక్తమై సంద్రంలో చిలికిన 
వెన్నలా కరుగుతుంది.!!

నోటి నుంచి జారిన నాలుక కాలీ దాకా సాగి 
చంద్రుని మింగినట్లు 
భయంకర ఓంకారం ఒకటి 
తెరలు తెరలుగా వ్యాపిస్తుంది.!!

మంచు ముత్యాల పర్వతాలు శ్వేత మేఘాల రెక్కలు తొడిగి ఎక్కడికో ఎగిరిపోతున్నవీ!!

నీటి బిందువుల లేత స్వేధనం
ఎదలోతుల్లో జారిపోతున్నాయి.!

జలకాలాడిన హంస నడకల జాడలు 
తీరం వెంట సాగుతున్నవీ!!!

తప్పిపోయిన ఇసుక గూడులు 
ఆకాశ మేడల్లో దాగిపోతున్నవీ!!!

ఉప్పెన ఒకటి 
పడవను వాగ్దానం చేసింది.!!

ధరిత్రి రహదారులన్నీ 
రాక్షస క్రీడల్లో మునిగి ఉన్నవీ!!!

ఎడతెరిపి లేని వాన 
నిండు చూలాలులా ప్రసవించింది.!!

సగం సగం సంపూర్ణం కాదు 
సౌష్టవం అంటూ సముద్రం ప్రకటన చేసింది.!!

డా ప్రతాప్ కౌటిళ్యా 👏

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
🙏👌👌
అజ్ఞాత చెప్పారు…
So nice 👍👍 super