అక్షరాలు
ఆడించమంటున్నాయి
అల్లమంటున్నాయి
అలరించమంటున్నాయి
అక్షరాలు
కూర్చమంటున్నాయి
కుందనపుబొమ్మనుచేయమంటున్నాయి
కుతూహలపరచమంటున్నాయి
అక్షరాలు
వెలిగించమంటున్నాయి
వేడుకచేయమంటున్నాయి
వినోదపరచమంటున్నాయి
అక్షరాలు
ఆడమంటున్నాయి
పాడమంటున్నాయి
చూడమంటున్నాయి
అక్షరాలు
అందుకోమంటున్నాయి
విసురుకోమంటున్నాయి
ఏరుకోమంటున్నాయి
అక్షరాలు
తేనెనుపూయమంటున్నాయి
తీపినిపంచమంటున్నాయి
తృప్తినికలిగించమంటున్నాయి
అక్షరాలు
చినుకుల్లాకురిపించమంటున్నాయి
వాగుల్లాపారించమంటున్నాయి
కెరటాల్లాఎగిసిపడేలాచేయమంటున్నాయి
అక్షరాలు
పూలగామార్చమంటున్నాయి
పరిమళాలుచల్లమంటున్నాయి
పరవశపరచమంటున్నాయి
అక్షరాలు
పట్టుకోమంటున్నాయి
ముట్టుకోమంటున్నాయి
మూటకట్టుకోమంటున్నాయి
అక్షరాలు
అందాలుచూపుతామంటున్నాయి
ఆనందాలుకలిగిస్తామంటున్నాయి
అంతరంగాలనుదోస్తామంటున్నాయి
అక్షరాలను
ఆమోదిస్తా
ఆహ్లాదపరుస్తా
అక్షరాలను
ప్రసన్నంచేసుకుంటా
పుటలకెక్కిస్తా
పాఠకులకుచేరుస్తా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి