జ్ఞాపకాల గనిలో
మనసుకు ఉత్సాహన్నిచ్చిన
సంతోషాల నిక్షేపాలు
బ్రతుకు గమనంలో జీవమిచ్చే క్షణాలు!
రోజులు గడిచినా
తాజాగా ఉండే ఆనందాలు
గతం తాలూకు అనుబంధాల
స్నేహ మధురిమలు!
కలతల నీడల సాగిన
గడచిన వేదనలు
కనుమరుగైన ఆత్మ బంధాల
వీడని మమకారాలు!
అంతరంగపు సుడిలో తిరుగుతూ
ఏది పైకి వస్తుందో ఏది కిందికో
ఏది కంటిని చెలమ చేస్తుందో
నిత్య జీవన యాత్రలో!
మనసొక మమతల నిధి
మాట వినని పద్ధతి దానిది
పూటకొక తలపును తెచ్చి
ఊటగా మురిపిస్తుంది!
పొంగే తరగల కదలికలు
పొందే భావ ప్రకంపనలు
పంచిన ప్రేమాభిమానాలే
పెంచును జీవన ప్రమాణాలు!
మనిషిని ముందుకు నడిపే
మనసే విరిసే పూవనం
కలుపులకు చోటివ్వక
కాచుకోడమే జీవితం!
మరో మంచి ఉదయానికి
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి