రవికాంతులతో
శశివెన్నెలతో
వెలిగిపోతున్నదే
మా ఇల్లు
చిరునవ్వులతో
శాంతిసుఖాలతో
మురిసిపోతున్నదే
మా ఇల్లు
అతిధులతో
ఆహ్వానితులతో
కళకళలాడుతున్నదే
మా ఇల్లు
అందచందాలతో
ఆనందపరవశంతో
ఆకర్షిస్తున్నదే
మా ఇల్లు
నాలుగువైపులాచెట్లతో
సుమసౌరభాలతో
నందనవనాన్ని తలపిస్తున్నదే
మా ఇల్లు
పక్షుల కిలకిలతో
పూలపండ్లతో
పరవశపరుస్తున్నదే
మా ఇల్లు
అందరికీ నచ్చేలా
చూచినవారు మెచ్చేలా
తీర్చిదిద్దబడినదే
మా ఇల్లు
ప్రేమమూర్తులతో
సేవాతత్పరులతో
నిండియున్నదే
మా ఇల్లు
వంటల ఘుమఘుమలతో
వేడివేడి వడ్డింపులతో
విలసిల్లుచున్నదే
మా ఇల్లు
మీ రాకకోసం
మీ దీవెనలకోసం
ఎదురుచూస్తున్నదే
మా ఇల్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి