తరంగ్ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ : - టి. వేదాంత సూరి


 హైదరాబాద్ తిలక్ నగర్ లో వున్న గోషామహల్ ప్రభుత్వ బాలికల పాఠశాల  ఏడవ తరగతి విద్యార్థులు తరంగ్ పేరిట ఒక ప్రత్యేక సంచికను అందంగా రూపొందించారు. వీరికి మార్గ దర్శకులుగా వున్న శరత్ బాబు ఒజ్జ నెల రోజుల క్రితం ఏప్రిల్ 4 వ తేదీన నన్ను రమ్మని  పిల్లలు ప్రత్యకంగా ఆహ్వానిస్తున్నారని చెప్పారు. నాకు ఎంతో సంతోషం వేసింది. వారు మొలక లో క్రమం తప్పకుండా రచనలు చేస్తుంటారు అందుకే వారిని చూడాలన్న కోరిక నాకు కూడా పెరిగింది. తీరా నెలరోజులుగా నిరీక్షిస్తున్న రోజు రానే వచ్చింది. శుక్రవారం ఏప్రిల్ 4 వ తేదీన పిల్లలకు కొన్ని పుస్తకాలు , కొన్ని బహుమతులు పట్టుకుని పాఠశాలకు వెళ్ళాను . శరత్ కుమార్ ఒజ్జ, పిల్లలు ఎంతో ప్రేమగా ఆత్మీయంగా నన్ను ఆహ్వానించి ప్రధానోపాధ్యాయుడు గుమ్మన్న గారి వేణుమాధవ శర్మ, హిందీ ఉపాధ్యాయుడు ఎం . డి. యదుల్లా ను పరిచయం చేశారు. మేం అందరం మూడో అంతస్తులో వున్న  ఏడవ తరగతి గదికి వెళ్ళాం .. పిల్లల ముఖాల్లో ఆనందం, నన్ను చూడగానే ఆదరణ ఆప్యాయత కనిపించాయి. నాకు అంతకంటే రెట్టింపు ఆనందం వేసింది. ఆ తరగతి గది పిల్లలందరికీ మార్గదర్శకంగా అనిపించింది . పిల్లల కార్యక్రమాలు, వారి నడవడి, క్రమశిక్షణ , తదితర వివరాలు శరత్ బాబు చెప్పారు..తరంగం ప్రత్యేక సంచిక నేను ఆవిష్కరించిన తరువాత  వారందరితో బాగా చదవాలని, బాగా రాయాలని మీరంతా ఒక తరంగం లాగ హిమాలయాల ఎత్హు ఎదగాలని నేను సలహా ఇచ్చాను. వారు నాకు అందమైన జ్ఞాపిక, శాలువా  బహూకరించారు. మీ రచనలు నిరంతరం మొలకను పంపాలని వారితో చెప్పను  ఈ అద్భుత క్షణాలను మనసులో పదిల పరచుకుని వారితో సెలవు తీసుకుని  వచ్చాను.  
కామెంట్‌లు
Vojjala Sharath babu చెప్పారు…
మీ సహృదయతకు నమః పూర్వక ధన్యవాదములు సూరి గారూ! మీ రాక పిల్లలో నూతన ఉత్సాహం నిండింది. మీ సందేశం వారి లో మరింత శక్తిని నింపిందని బాల కవులు/రచయితలు చెప్తూన్నారు. మీ ఆశీస్సులు వారిని ఇంకా ముందుకు నడిపించాలని ఆశిస్తూ.. ప్రభుత్వ.బాలికల ఉన్నత పాఠశాల గోషామహల్ అంబర్పేట్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు అందరం నమః పూర్వక ధన్యవాదములు అందజేస్తూన్నాము.
ఇలా ప్రతి పాఠశాల విద్యార్థులకు మీ ఆశీస్సులు అందాలని ఆశిస్తూ...మన మొలక కు జయోఽస్తు