తాత మనసు ..: - డా. కె.ఎల్.వి.ప్రసాద్, హనంకొండ.

తాతముఖం చూసి 
తాత పరిస్తితి 
చెప్పేస్తా ......!


కొపంగా ఉన్న 
తాతను 
ఇట్టే గుర్తుపట్టేస్తా !


తాతముఖం 
అసలే సీరియస్ ,
కోపమొస్తే ...
మాటలకర్ధం కాని ,
రూపం ....!


అది కనిపెట్టి 
ముద్దు ..ముద్దు 
మాటలు చెప్పి 
తాతను నవ్వించేస్తా !


అమ్మమీద 
నాకుకోపం వస్తే ,
అమ్మ నన్ను ఏడిపిస్తే ,
తాతను --సీరియస్గా 
చూడమంటా ..!


తాత నుండి 
చాకోలెట్ 
ఎలాతీసుకోవాలో 
నాకుబాగాతెలు సు !


తాత మనసు ...
నాకు కాక --
ఇంకెవరి కి తెలుసు ..!!
---------------------------
ఫొటో లో......ఆన్షి.నల్లి*


కామెంట్‌లు