ప్రతిఙ్ఞ .....:--డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ


ఆటల సమయం 
ఆటలది .......!


అల్లరి సమయం 
అల్లరిది .......!


ఆకలి సమయం 
తిండిది .......!


వినోద సమయం 
రేడియో ..టి .వి ,ది !


చదువు సమయం 
చాల విలువైనది ,


అందుకే ...
పుస్తకం -పెన్సిలు 
నాకు దగ్గరైనవి ...!


చదివేటప్పుడు 
ఆడను ....


ఆడేటప్పుడు 
చదవను ....


సమయపాలనలో 
బుద్దిగా అందరికీ 
సహకరిస్తాను !


మంచి బాలికగా 
పేరు తెచ్చుకుంటాను !!



కామెంట్‌లు